జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే 2018 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ ఆడని మహ్మద్ సిరాజ్ కివిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. అదే సమయంలో అతడి ఎడమ చేతికి గాయమై రక్త వచ్చింది. ఆఖరి ఓవర్ మొదటి బంతిని మిచెల్ సాంట్నర్ స్ట్రేట్ డ్రైవ్ చేశాడు. బంతిని సిరాజ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చేయికి దెబ్బ తగిలింది. అతడికి ఫిజియో మైదానంలోకి వెళ్లి చికిత్స అందించాడు.
— Maqbool (@im_maqbool) November 18, 2021
భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డగౌట్‌లో రోహిత్ శర్మ, సిరాజ్, కేఎల్ రాహుల్ ఉన్నారు. వారి ముందు కోచ్ ద్రవిడ్ కూర్చున్నాడు. అయితే సిరాజ్ ఎవరినో తదేకంగా చూస్తున్నాడు. అక్కడే ఉన్న రోహిత్ సిరాజ్ తలపై కొట్టాడు. దీంతో సిరాజ్ నవ్వాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత కెప్టెన్ ఎందుకు అలా చేసాడు అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Why did Rohit hit Siraj???#INDvNZ #RohitSharma pic.twitter.com/EjqnUXts3v
— Bhanu? (@its_mebhanu) November 17, 2021
కివిస్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 48 రన్స్ సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 42 బంతుల్లో 70, మార్క్ చాప్‌మన్ 50 బంతుల్లో 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ (2/23), భువనేశ్వర్ కుమార్ (2/24) రాణించారు.
Read Also.. Wasim Jaffer: ఇండియా, కివీస్ మ్యాచ్‌పై అదిరిపోయే ట్వీట్ చేసిన వసీం జాఫర్.. అందులో ఏముందంటే..