IND vs BAN: బంగ్లా చేతిలో భంగపాటు.. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. సిరీస్‌ మాత్రం మనదే..

|

Jul 13, 2023 | 8:06 PM

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టుపై బంగ్లాదేశ్ మహిళలు అద్భుత విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది . అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు పేలవ ఆరంభం దక్కింది.

IND vs BAN: బంగ్లా చేతిలో భంగపాటు.. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి.. సిరీస్‌ మాత్రం మనదే..
Ind Vs Ban
Follow us on

ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టుపై బంగ్లాదేశ్ మహిళలు అద్భుత విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది . అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు పేలవ ఆరంభం దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (11) తక్కువస్కోరుకే వెనుదిరిగారు. ఆతర్వాత వచ్చిన జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారీస్కోర్లు మాత్రం చేయలేకపోయారు. 28 పరుగులు చేసి జెమీమా నిష్క్రమిస్తే, హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా 40 పరుగులు చేసి తన ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ దశలో మరింత చెలరేగిన బంగ్లా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీశారు. ఒక దశలో 91/4 తో పటిష్ఠంగా కనిపించింది భారత్‌. ఆతర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున రబియా ఖాన్ 3 వికెట్లు తీయగా, సుల్తానా ఖాతూన్ 2 వికెట్లు తీశారు.

సిరీస్‌ భారత్‌దే..

103 పరుగుల సులువైన విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు షమీమా సుల్తానా శుభారంభం అందించింది. 42 పరుగులు చేసిన షమీమా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. అయితే బంగ్లాదేశ్ జట్టు మిడిలార్డర్‌లో కుప్పకూలడంతో 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే షమీమా సుల్తానా జాగ్రత్తగా బ్యాటింగ్‌ను ప్రదర్శించి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరకు రీతూ మోని అజేయంగా 7 పరుగులు, నహిదా అక్తర్ 18.2 ఓవర్లలో అజేయంగా 10 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా మూడు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11:

షమీమా సుల్తానా, షాతీ రాణి, దిలారా అక్తర్, నిగర్ సుల్తానా (లీడర్), రీతు మోని, షోర్నా అక్తర్, నహిదా అక్తర్, రబియా ఖాన్, సుల్తానా ఖాతున్, ఫాహిమా ఖాతున్, మారుఫా అక్తర్.

టీమ్ ఇండియా ప్లేయింగ్ 11:

స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యాస్తిక భాటియా (వికెట్ కీపర్), దీప్తి శర్మ, దేవిక వైద్య, అమంజోత్ కౌర్, పూజా వస్త్రాకర్, మిన్ను మణి, రాశి కనోజియా.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..