అతిపెద్ద టెస్ట్ సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ స్టేడియం)లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరుజట్ల స్పిన్నర్లు ఈ సిరీస్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీంల గెలుపును డిసైడ్ చేసిది కేవలం స్పిన్నర్లే కాబట్టి.. వీరిదే కీలకపాత్ర కానుంది. అయితే ఏ జట్టు బ్యాట్స్‌మెన్స్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటే.. ఆ జట్టుదే విజయం అన్నమాట. కాగా, 2017లో భారత పర్యటనలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫాంతో సత్తా చాటాడు. మరోసారి అదే ఫాంతో దూసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాడు.
తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు నాగ్‌పూర్ చేరుకున్నాయి. VCA స్టేడియం పిచ్ కూడా స్పిన్నర్లకు సహాయం చేస్తుందని తేలింది. అటువంటి పరిస్థితిలో, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ సుదీర్ఘ పోరాటాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. తద్వారా 18 సంవత్సరాల తర్వాత భారతదేశంలో సిరీస్ విజయం కోసం నిరీక్షణ ముగిసే అవకాశం ఉంది.
స్మిత్ మాట్లాడుతూ ఈ సిరీస్ కోసం చాలా సిద్ధమైనట్లు ప్రకటించాడు. అతను మ్యాచ్‌కు రెండు రోజుల ముందు భారత జట్టుకు సవాలు విసిరాడు. ఫిబ్రవరి 7, మంగళవారం నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో స్మిత్ మాట్లాడుతూ, 2017 లాంటి ప్రదర్శన ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రకటించాడు.
2017లో ఆస్ట్రేలియా చివరి భారత పర్యటనకు వచ్చింది. ఇందులో స్మిత్ రెండు జట్లలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు. అతని బ్యాట్‌లో సెంచరీ సహా 499 పరుగులు వచ్చాయి.
ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఓడిపోయినా స్మిత్ ఫాం చెక్కుచెదరలేదు. పుణెలో జరిగిన తొలి టెస్టులోనే ఘోరమైన టర్నింగ్ పిచ్‌పై స్మిత్ అద్భుతమైన సెంచరీ సాధించగా, ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ఆశ్చర్యపరిచింది. అంటే, ఈసారి స్మిత్ తన జట్టును గెలిపించేలా 499 ఫిగర్‌ను దాటాలని ప్రయత్నిస్తున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి స్మిత్ బ్యాట్ ఎంత రాణిస్తుందనే దానిపైనే ఆస్ట్రేలియా విజయం ఆధారపడి ఉంటుంది. స్మిత్‌కు కూడా స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటాడు. నాగ్‌పూర్ స్టేడియం పిచ్ గురించి ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ మాట్లాడుతూ, “వికెట్ ఒక చివర నుంచి చాలా పొడిగా ఉంది. దానిపై స్పిన్ ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ కోసం బంతిని లోపలికి తీసుకువస్తారు. అక్కడ ఒక భాగం చాలా పొడిగా ఉందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..