FIR On Mitchell Marsh: ఫైనల్లో టీమిండియాను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తరువాత ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. వాస్తవానికి, ఈ ఫొటోలో మిచెల్ మార్ష్ తన కాళ్ళ కింద ప్రపంచ కప్ ట్రోఫీని ఉంచినట్లు చూడొచ్చు. దీంతో క్రికెట్ అభిమానులు పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడు మిచెల్ మార్ష్ కష్టాలు పెరగవచ్చని తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త మిచెల్ మార్ష్‌పై కేసు పెట్టారు. ప్రపంచకప్ ట్రోఫీని మిచెల్ మార్ష్ తన కాళ్ల కింద ఉంచిన తీరు భారత అభిమానుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు.
పాట్ కమిన్స్ నాయకత్వంలో ఆస్ట్రేలియా ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత, మిచెల్ మార్ష్ చేతిలో బీర్, అతని కాళ్ళ కింద ప్రపంచ కప్ ట్రోఫీతో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదే సమయంలో, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ చర్యలపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
An FIR has been filed against Australia all-rounder Mitch Marsh by Pandit Keshav who is an RTI activist. The complaint was filed in Aligarh in UP. It states that Marsh’s conduct of dropping legs on the World Cup trophy had hurt Indian cricket team fans 👀
He also sent a copy of… pic.twitter.com/eCydGdt0JD
— Farid Khan (@_FaridKhan) November 24, 2023
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా సవాల్‌ను టీమిండియా ఎదుర్కోవడం గమనార్హం. అయితే రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తద్వారా మూడోసారి ప్రపంచకప్ ఛాంపియన్ కావాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. అదే సమయంలో, కంగారూలు ఆరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..