IND Vs AUS: భారత్‌తో మూడో టెస్ట్.. ఆసీస్‌కు గట్టి షాక్.. కెప్టెన్‌తో పాటు మరో 4గురు ప్లేయర్స్ దూరం!

|

Feb 20, 2023 | 4:40 PM

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆడిన రెండు టెస్టులలోనూ ఓడిపోయిన..

IND Vs AUS: భారత్‌తో మూడో టెస్ట్.. ఆసీస్‌కు గట్టి షాక్.. కెప్టెన్‌తో పాటు మరో 4గురు ప్లేయర్స్ దూరం!
Ind Vs Aus
Follow us on

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆడిన రెండు టెస్టులలోనూ ఓడిపోయిన పర్యాటక జట్టు ఇప్పుడు సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది. అయితే ఈలోగా 5 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే స్వదేశానికి పయనమయ్యారు. ఈ ఐదుగురు ప్లేయర్స్ మళ్లీ భారత్ తిరిగి వచ్చే అవకాశం లేదని ఆసీస్ మీడియా పేర్కొంది. కుటుంబ కారణాల వల్ల ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లగా.. ఇంతలో, ఓపెనర్ డేవిడ్ వార్నర్, జోష్ హేజిల్‌వుడ్ గాయాలు కారణంగా తిరిగి ఆసీస్ వెళ్తున్నారు.

రెండు, మూడో టెస్టు మధ్య దాదాపుగా 10 రోజుల సమయం ఉంది. ఈలోపు వ్యక్తిగత కారణాల వల్ల ఆసీస్ సారథి కమిన్స్ సిడ్నీకి పయనం అయ్యాడు. వస్తే మూడో టెస్టు ప్రారంభానికి ముందే జట్టులో చేరుతాడు. లేదా.. మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే కమిన్స్‌తో పాటు వార్నర్, హేజిల్‌వుడ్ కూడా ఆస్ట్రేలియాకు పయనం అయ్యారు. గత నెలలో జరిగిన సిడ్నీ టెస్టులో గాయానికి గురైన హేజిల్‌వుడ్ ఇప్పటికీ పూర్తి ఫిట్‌ కాలేడు. దీంతో అతడు మొత్తం సిరీస్‌కు దూరం కానున్నాడు.

హేజిల్‌వుడ్‌తో పాటు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గాయపడిన వార్నర్ కూడా గాయం నుంచి కోలుకోలేదు. మీడియా కథనాల ప్రకారం, వార్నర్ మిగిలిన రెండు టెస్టులకు దూరమై స్వదేశానికి తిరిగి రానున్నాడని తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురితో పాటు అష్టన్ అగర్, మాట్ రెన్షా కూడా ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్తున్నారని సమాచారం. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఈ మేరకు కథనంలో పేర్కొంది.