IND vs AUS: 11 ఫోర్లు, 8 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో విశాఖలో బీభత్సం.. టీ20ల్లో తొలి సెంచరీతో ఊచకోత..

Josh Inglis: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో జోష్ ఇంగ్లీష్ 110 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ తొలి సెంచరీ సాధించాడు.

IND vs AUS: 11 ఫోర్లు, 8 సిక్సులు.. 220 స్ట్రైక్‌రేట్‌తో విశాఖలో బీభత్సం.. టీ20ల్లో తొలి సెంచరీతో ఊచకోత..
Inglis

Updated on: Nov 23, 2023 | 9:00 PM

భారత్‌తో విశాఖపట్నంలో జరుగుతోన్న మొదటి T20I సందర్భంగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ తన తొలి T20I సెంచరీని కొట్టాడు. ఆస్ట్రేలియన్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి, భారత బౌలింగ్ దాడిని చీల్చి చెండాడాడు. ఆ తర్వాత ఇదే ఊచకోతతో కేవలం 47 బంతుల్లో మూడు అంకెల మార్కును చేరుకున్నాడు.

ఈ సెంచరీకి మార్గంలో, ఇంగ్లిస్ 224.49 స్ట్రైక్ రేట్ వద్ద 11 బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. అతను 50 బంతుల్లో 110 పరుగులు చేసి చివరకు ప్రసీద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

47 బంతుల్లో T20I సెంచరీ బాదిన జాయింట్‌గా రెండవ వేగవంతమైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా ఇంగ్లిస్ ఆరోన్ ఫించ్‌తో కలిసి టాప్‌లో నిలిచాడు. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్‌పై ఫించ్ ఈ రికార్డు నెలకొల్పాడు.

తన కెరీర్‌లో మొదటిసారి యాభై పరుగుల మార్కును దాటిన ఇంగ్లిస్, అలాగే T20I సెంచరీ చేసిన ఐదవ ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు.

31/1 స్కోర్ వద్ద మాథ్యూ షార్ట్ వికెట్ పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లీస్ భారత బౌలర్‌లపై తుఫాన్ బ్యాటింగ్‌తో అద్భుతమైన సెంచరీని కొట్టాడు.

ఇంగ్లిస్ స్టీవ్ స్మిత్‌తో చేతులు కలిపి సెంచరీ స్కోర్‌తో బలమైన స్కోరు నమోదు చేసి ఆస్ట్రేలియాను బలపరిచాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11:

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(కీపర్/కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..