IND vs AFG Test : అఫ్గానిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా పక్కా ప్లాన్.. బుమ్రాకు రెస్ట్.. కొత్త కుర్రాళ్లకు ఛాన్స్

IND vs AFG Test : ఐపీఎల్ 2026 తర్వాత అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బలమైన జట్టును రంగంలోకి దించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు.

IND vs AFG Test : అఫ్గానిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్.. టీమిండియా పక్కా ప్లాన్.. బుమ్రాకు రెస్ట్.. కొత్త కుర్రాళ్లకు ఛాన్స్
Ind Vs Afg Test

Updated on: May 12, 2026 | 11:42 AM

IND vs AFG Test : ఐపీఎల్ 2026 సందడి ముగియగానే టీమిండియా మళ్లీ వైట్ డ్రెస్సులో మెరవనుంది. అఫ్గానిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత సెలక్టర్లు కసరత్తు మొదలుపెట్టారు. జూన్ 6 నుంచి 10 వరకు చండీగఢ్‌లోని ముల్లాంపూర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో సీనియర్లకు విశ్రాంతి ఇస్తారని అందరూ భావించినా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీసీసీఐ ఈ మ్యాచ్ కోసం దాదాపు ఫుల్ స్ట్రెంత్ టీమ్‌ను రంగంలోకి దించనుంది. దీని తర్వాత రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది.

టీమిండియా మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ రిపోర్ట్ రావడంతో సీనియర్ ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యువ స్టార్ శుభ్‌మన్ గిల్ జట్టును నడిపించనున్నాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్‌లో రిషబ్ పంత్ తన మార్క్ బ్యాటింగ్‌తో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడేందుకు రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

నెంబర్-3 స్థానం విషయంలోనే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం.. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టి, దేవదత్ పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. పడిక్కల్ రంజీ ట్రోఫీలో, ఇతర దేశీయ క్రికెట్ టోర్నమెంట్లలో వరుస సెంచరీలతో ఫామ్‌లో ఉన్నాడు. అందుకే సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి మరో అవకాశం ఇచ్చి పరీక్షించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

బౌలింగ్ విభాగంలో మాత్రం కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. త్వరలో జరగబోయే కీలక సిరీస్‌ల దృష్ట్యా అతనిపై ఒత్తిడి పడకుండా చూడాలని సెలక్టర్లు నిర్ణయించారు. రంజీల్లో అదరగొట్టిన ఆకిబ్ నబీకి ఈ టెస్టులో అరంగేట్రం చేసే అవకాశం దక్కవచ్చు. అలాగే మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు ఐపీఎల్ తర్వాత ఫిట్‌నెస్‌ను బట్టి జట్టులో చేరనున్నారు. మహమ్మద్ షమీ, అన్షుల్ కాంబోజ్ కూడా రేసులో ఉన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us