Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

Love Affairs: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం అప్పట్లో సంచలనంగా మారింది. జీనత్ అమన్, మున్‌మున్ సేన్, షబానా ఆజ్మీ, రేఖతో ఆయనకు సంబంధాలు ఉన్నాయంటూ పలు కథనాలు వెలువడ్డాయి. వీటిలో కొన్ని కేవలం మీడియా ప్రచారాలుగానే మిగిలిపోయాయి.

Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు
Imran Khan

Updated on: Aug 22, 2026 | 7:10 AM

Love Affairs: పాకిస్థాన్ మాజీ ప్రధాని, టీమిండియాను ఒకప్పుడు ముప్పతిప్పలు పెట్టిన మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. రావల్పిండి జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన పరిణామాల మధ్య, గతంలో బాలీవుడ్ అందాల భామలతో ఆయన నడిపిన సీక్రెట్ లవ్ స్టోరీలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

జీనత్ అమన్‌తో మొదలైన సంచలనం

పాకిస్థాన్ క్రికెట్ జట్టు నాయకుడిగా దేశ విదేశాల్లో విశేష ఆదరణ పొందిన ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగింది. 70వ దశకంలో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జీనత్ అమన్, ఇమ్రాన్ ఖాన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. క్రికెట్ టూర్ల సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ప్రేమాయణం గురించి వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ఈ బంధం ఎక్కువ కాలం నిలవకపోయినా, ఇప్పటికీ వీరిద్దరి పేరు చర్చకు వస్తూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి: Sachin vs Kohli: సచిన్ కంటే కోహ్లీనే తోపు.. ఏం వాగుతున్నావ్ బ్రో..సౌతాఫ్రికా దిగ్గజం పై నెటిజన్లు ఫైర్

మున్‌మున్ సేన్ ప్రేమలో క్లీన్ బోల్డ్

బెంగాలీ, హిందీ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మున్‌మున్ సేన్‌తో ఇమ్రాన్ ఖాన్ క్లోజ్ ఫ్రెండ్‌షిప్ అప్పట్లో ముఖ్యాంశంగా మారింది. ఇమ్రాన్ ఆకర్షణకు మున్‌మున్ సేన్ ఫిదా అయ్యారని, వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని కథనాలు వచ్చాయి. ఇద్దరూ బహిరంగంగా తమ బంధాన్ని ధ్రువీకరించనప్పటికీ, వీరి కలయిక అప్పట్లో బాలీవుడ్, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.

షబానా ఆజ్మీతో ప్రచారం మాత్రమేనా?

దిగ్గజ నటి షబానా ఆజ్మీ పేరు కూడా ఇమ్రాన్ ఖాన్‌తో ముడిపడి ప్రచారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంపై ఆ రోజుల్లో పత్రకాయల్లో రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై ఇటు శబానా ఆజ్మీ గానీ, అటు ఇమ్రాన్ ఖాన్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. ఇదంతా కేవలం మీడియా సృష్టించిన పుకారుగానే మిగిలిపోయింది.

ఇది కూడా చదవండి: Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు

రేఖతో పెళ్లికి సిద్ధపడ్డారా?

బాలీవుడ్ ఐకానిక్ నటి రేఖతో ఇమ్రాన్ ఖాన్ నడిపిన డేటింగ్ పుకార్లు తీవ్ర సంచలనం రేపాయి. ఒకానొక సమయంలో రేఖ, ఇమ్రాన్‌ను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటూ కొన్ని ఆంగ్ల పత్రికలు కథనాలను ప్రచురించాయి. రేఖ తల్లికి కూడా ఇమ్రాన్ ఖాన్ అల్లుడిగా ఎంతో నచ్చారని ఆ నివేదికలు పేర్కొన్నాయి. ఈ సుదీర్ఘ ప్రేమాయణాలు ఏవీ కూడా శాశ్వత బంధంగా మారకుండానే ముగిసిపోవడం గమనార్హం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us