వరల్డ్ కప్ 2019 ఫైనల్: ఇదేం లెక్క..ఐసీసీపై నెటిజన్ల ఆగ్రహం

|

Jul 15, 2019 | 8:49 AM

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..వరల్డ్ కప్ చరిత్రలోనే కాదు..వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోతుంది. మొదట మ్యాచ్ టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించండం తెలిసిందే. అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా […]

వరల్డ్ కప్ 2019 ఫైనల్: ఇదేం లెక్క..ఐసీసీపై నెటిజన్ల ఆగ్రహం
Follow us on

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..వరల్డ్ కప్ చరిత్రలోనే కాదు..వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే నిలిచిపోతుంది. మొదట మ్యాచ్ టై అవ్వడం..సూపర్ ఓవర్ కూడా టై అవ్వడంతో..అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండును విజేతగా ప్రకటించండం తెలిసిందే.

అయితే బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడంపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. బౌండరీలకు బదులు వికెట్లను కౌంట్ చేస్తే గనుక.. ఇంగ్లాండ్ 241-ఆలౌట్, న్యూజిలాండ్ 241-8 పరుగులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి ఉండేది. కానీ బౌండరీ కౌంట్‌ను పరిగణలోకి తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు గెలిచింది. ఇది బ్యాట్స్‌మెన్ ఫేవర్ గేమ్ అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని చాలామంది క్రీడా నిపుణులు అంటున్నారు.

కేవలం బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం సరికాదని చాలామంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.  విజేతను నిర్ణయించడానికి ఇలాంటి పద్దతిని ఎంచుకోవడం చాలా దారుణమని ట్విట్టర్ ద్వారా పలువురు సీనియర్ ఆటగాళ్లు  అభిప్రాయపడ్డాడు. ఇక  బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం కాకుండా.. ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని మరికొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.