
ICC World Cup 2023 Tickets: 2023 ప్రపంచ కప్ పూర్తి షెడ్యూల్ రిలీజ్ అయింది. జూన్ 27న ఐసీసీ ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఇందులో 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 48 మ్యాచ్‌లు ఈ ట్రోర్నీలో జరగనున్నాయి. అక్టోబరు 5 నుంచి 2023 ప్రపంచకప్ మొదలుకానుంది. టైటిల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో గతసారి ఫైనల్లో తలపడిన ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే, ఇప్పటి వరకు టిక్కెట్ల విషయంలో ఎలాంటి స్పష్టత బయటకు రాలేదు.
ప్రపంచకప్‌కు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి, ధర ఎంతలాంటి విషయాలు వివరంగా తెలుసుకుందాం.. అయితే టోర్నీకి సంబంధించిన టిక్కెట్లు ఇప్పటి వరకు విడుదల కాలేదు. కారణం, షెడ్యూల్ లేట్ కావడం వల్లనే అని తెలుస్తోంది. ‘ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. 2023 ప్రపంచకప్ టిక్కెట్లపై త్వరలో బీసీసీఐ, ఐసీసీ కీలక ప్రకటన చేయనుంది. చాలా వరకు టిక్కెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే లభించనున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉంచనున్నారు. ఐసీసీ వెబ్‌సైట్లో కాకుండా బుక్‌మైషో, పేటీఎంలో కూడా టిక్కెట్లు సేల్‌కు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
నివేదికల మేరకు, టికెట్ల ధరలు 500ల రూపాయాల నుంచి . 10వేల రూపాయాల వరకు ఉండవచ్చని అంటున్నారు. ఈ రేట్లు వేదికలను బట్టి మారుతాయని తెలుస్తుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ మొత్తం 10 స్టేడియాల్లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌ల్లోనూ కీలకమైన మ్యాచ్ అంటే భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ 11న ఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
ఇండియా vs ఆస్ట్రేలియా, అక్టోబర్ 8, చెన్నై.
భారతదేశం vs ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 11, ఢిల్లీ.
భారతదేశం vs పాకిస్థాన్, 15 అక్టోబర్, అహ్మదాబాద్.
భారత్ v బంగ్లాదేశ్, అక్టోబర్ 19, పూణే.
భారత్ vs న్యూజిలాండ్, అక్టోబర్ 22, ధర్మశాల.
ఇండియా vs ఇంగ్లండ్, అక్టోబర్ 29, లక్నో.
భారత్ vs శ్రీలంక, నవంబర్ 2, ముంబై.
భారత్ vs సౌతాఫ్రికా, నవంబర్ 5, కోల్‌కతా.
భారత్ vs నెదర్లాండ్స్, నవంబర్ 11, బెంగళూరు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..