ఇంగ్లాండ్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు

| Edited By:

Jun 09, 2019 | 8:41 AM

పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లాండ్.. ఏ జట్టుకైన చుక్కలు చూపే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 106 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కొర్‌ను అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. టార్గెట్‌ను చేధించడంలో […]

ఇంగ్లాండ్ చేతిలో బంగ్లాదేశ్ చిత్తు
Follow us on

పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లాండ్.. ఏ జట్టుకైన చుక్కలు చూపే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 106 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. ప్రపంచకప్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 386 పరుగులు సాధించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీతో చెలరేగి జట్టుకు భారీ స్కొర్‌ను అందించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. టార్గెట్‌ను చేధించడంలో చేతులెత్తేసింది.

బంగ్లా బ్యాట్స్‌మెన్‌లలో షకిబ్ అల్ హసన్ అద్భుత శతకంతో రాణించగా.. ముష్పికర్ రహిమ్ అండగా నిలిచి పర్వాలేదనిపించాడు. వీరిద్దరు ఉన్నంత సేపు బంగ్లా విజయం ఖాయంగా కనిపించింది. కానీ కీలక సమయంలో ఇద్దరు ఔట్ కావడంతో.. 48.5 ఓవర్లలోనే 280 పరుగుల వద్ద బంగ్లా పోరాటం ముగిసింది.