రోహిత్ తగ్గకు..ఇంకో రెండు శతకాలు బాదెయ్- కోహ్లి

|

Jul 08, 2019 | 8:41 PM

ప్రస్తుత వరల్డ్ కప్‌లో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.  బ్యాక్ టూ బ్యాక్ సెంచరీస్‌తో బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. లీగ్ లెవల్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదేశాడు. దీంతో.. వరల్డ్‌కప్  చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అదే ఫామ్‌ని సెమీస్, ఫైనల్‌ల్లోనూ కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాక్షించాడు. అంతేకాదు వరల్డ్‌లోనే టాప్ వన్డే […]

రోహిత్ తగ్గకు..ఇంకో రెండు శతకాలు బాదెయ్- కోహ్లి
Follow us on

ప్రస్తుత వరల్డ్ కప్‌లో భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత ఫామ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.  బ్యాక్ టూ బ్యాక్ సెంచరీస్‌తో బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. లీగ్ లెవల్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ ఏకంగా ఐదు మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదేశాడు. దీంతో.. వరల్డ్‌కప్  చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. అదే ఫామ్‌ని సెమీస్, ఫైనల్‌ల్లోనూ కొనసాగించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాక్షించాడు. అంతేకాదు వరల్డ్‌లోనే టాప్ వన్డే క్రికెటర్ అంటూ తన టీమ్‌మేట్‌కు అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చాడు. టోర్నీ లీగ్ దశ శనివారంతో ముగియగా.. భారత్, న్యూజిలాండ్ మధ్య మంగళవారం మధ్యాహ్నం తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది.