చెలరేగిన బంగ్లా బ్యాట్స్‌మెన్… విండీస్ చిత్తు

| Edited By:

Jun 18, 2019 | 11:15 AM

బంగ్లా పులులు రెచ్చిపోతున్నారు. మొన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపిస్తే.. నిన్న విండీస్ భరతం పట్టారు. చిత్తుచిత్తుగా ఓడించారు. బంగ్లా బ్యాట్స్ మెన్‌లో షకీబ్, లిటన్‌దాస్ ధాటికి.. విండీస్ దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. విండీస్ బౌలర్లపై షకీబ్, లిటన్ దాస్‌లు విరుచుకుపడ్డారు. దీంతో 322 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 51 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది బంగ్లాదేశ్. లక్ష్యం పెద్దదే అయినప్పటికి బంగ్లా ఎక్కడా తడబడలేదు. షకీబ్ అల్ హసన్ సెంచరీతో కదం తొక్కడంతో […]

చెలరేగిన బంగ్లా బ్యాట్స్‌మెన్... విండీస్ చిత్తు
Follow us on

బంగ్లా పులులు రెచ్చిపోతున్నారు. మొన్న దక్షిణాఫ్రికాను మట్టికరిపిస్తే.. నిన్న విండీస్ భరతం పట్టారు. చిత్తుచిత్తుగా ఓడించారు. బంగ్లా బ్యాట్స్ మెన్‌లో షకీబ్, లిటన్‌దాస్ ధాటికి.. విండీస్ దాదాపు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే స్థితికి చేరుకుంది. విండీస్ బౌలర్లపై షకీబ్, లిటన్ దాస్‌లు విరుచుకుపడ్డారు. దీంతో 322 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 51 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది బంగ్లాదేశ్.

లక్ష్యం పెద్దదే అయినప్పటికి బంగ్లా ఎక్కడా తడబడలేదు. షకీబ్ అల్ హసన్ సెంచరీతో కదం తొక్కడంతో వెస్టిండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్‌లో షైహోప్ 96, లూయిస్ 70, హెట్‌మెయిర్ 50 పరుగులు చేసి మెరవడంతో విండీస్ మొదట 8 వికెట్ల 321 పరుగులు చేసింది.

లక్ష్యం పెద్దది కావడంతో బంగ్లా ఆ స్కోర్‌ను ఛేదించడం కష్టమే అయినా.. బంగ్లా బ్యాటింగ్ ధాటిగా ఆరంభించింది. తొలి వికెట్‌కు 8 ఓవర్లలోనే 52 పరుగులు జోడించారు. ఇక సర్కార్ ఔటయ్యాక.. షకీబ్ క్రీజ్‌లోకి రావడంతో స్కోర్ వేగం ఇంకా పెరిగింది. జోరుమీదున్న షకీబ్‌కు లిటన్ దాస్‌ తొడవడంతో.. నాలుగో వికెట్‌కు 189 పరుగులు జోడించి లక్ష్యాన్ని పూర్తి చేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఆరంభంలో తడబడటంతో.. ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. 10 ఓవర్లకు స్కోరు 32 పరుగులు మాత్రమే చేసింది. లూయిస్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన గేల్… 13 బంతులాడి ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరాడు. అయితే హోప్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా మారాడు. లూయిస్‌తో కలిసి రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించి భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. అయితే విండీస్ ఓ దశలో అత్యంత పటిష్టమైన స్థితిలో నిలిచింది. 350 పరుగులు చేసేలా కనిపించింది. కానీ ఒక్కొక్కరు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టడంతో చివరి 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది.