ICC U19 World Cup: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లండ్(IND U19 vs ENG u19) జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టీమ్ ఇండియా వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఐదోసారి టైటిల్ గెలుపొందడంపై దృష్టి పెట్టింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ టీంలు ఫైనల్‌కు చేరుకున్నాయి. యశ్ ధుల్ సారథ్యంలోని టీమ్ ఇండియా(Team India), అండర్ 19 ప్రపంచ కప్ అంతటా అజేయంగా నిలిచింది. ఫైనల్‌లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటోంది.
ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ టామ్ పెర్స్ట్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ ఇండియా ముందుగా బౌలింగ్ చేస్తుంది.
టోర్నీలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఫైనల్‌కు చేరడం వరుసగా ఇది నాలుగోసారి. 2016లో వెస్టిండీస్‌పై, 2020లో బంగ్లాదేశ్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
ఇంగ్లండ్ ప్లేయింగ్ XI : జార్జ్ థామస్, జాకబ్ బెతెల్, టామ్ ప్రెస్, జేమ్స్ ర్యూ, విలియం లిక్స్టన్, జార్జ్ బెల్, రెహాన్ అహ్మద్, అలెక్స్ హోర్టన్, జేమ్స్ సేల్స్, థామస్ ఆస్పిన్‌వాల్, జాషువా బోడెన్
భారత ప్లేయింగ్ XI – అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, యశ్ ధుల్, నిశాంత్ సింధు, రాజ్యవర్ధన్ హనర్గేకర్, దినేష్ బానా, కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవి కుమార్
Also Read: IND vs WI: టీమ్ ఇండియాలోకి మళ్లీ ‘కుల్చా’ జోడి.. మ్యాజిక్ పనిచేసేనా..?