Under 19 World Cup 2022: అండర్-19 ప్రపంచకప్ గెలిచే టీంలలో టీమిండియా ప్రధాన పోటీదారుగా నిలిచిందనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఓ వార్తతో ఈ ఆశలు అడియాశలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు, టీమిండియాలోని ఆరుగురు ఆటగాళ్లకు కరోనా సోకింది. కెప్టెన్ యశ్ ధుల్, వైస్ కెప్టెన్ ఎస్‌కే రషీద్‌తో సహా మొత్తం 6గురు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఆరాధ్య యాదవ్, వాసు వాట్స్, మానవ్ పరాఖ్, సిద్ధార్థ్ యాదవ్ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఈ ఆటగాళ్లందరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు.
కరోనా కారణంగా భారత జట్టు చాలా కష్టాల్లో కూరుకుపోయింది. ఐర్లాండ్‌పై ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవడంలో ఇబ్బంది పడింది.వాస్తవానికి, గత మ్యాచ్‌లో ఆడిన ఇద్దరు కీలక ఆటగాళ్లు మాత్రమే ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యశ్ ధుల్ స్థానంలో నిశాంత్ సింధును కెప్టెన్‌గా నియమించింది.
అదృష్టవశాత్తూ, ICC 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును తీసుకురావడానికి టీమ్ ఇండియాకు అనుమతిని ఇచ్చింది. దీని కారణంగా మిగిలిన 11 మంది ఆటగాళ్లు ఐర్లాండ్‌పై మైదానంలోకి రాగలిగారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, ఫీల్డ్‌లో ఆడుతున్న ఆటగాళ్ల కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కోచ్‌ని డ్రింక్స్‌తో పంపాల్సి వచ్చింది.
ICC T20 Team Of The Year: భారత ఆటగాళ్లకు అవమానం.. ఐసీసీ అత్యుత్తమ టీ20 జట్టులో నో ప్లేస్..!