అండర్ 19 వరల్డ్ కప్ (ICC Under 19 World Cup 2022) లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన టీమిండియాపై బహుమతుల వర్షం కురుస్తోంది. ప్రపంచకప్ గెలిచిన యశ్ ధుల్ జట్టుకు అహ్మదాబాద్‌లో సన్మానం చేయనున్నట్లు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై (India U19 vs England U19) విజయాన్ని నమోదు చేసిన తర్వాత భారత బృందం గయానాలోని భారత హైకమిషనర్‌ను కలుసుకుంది. కరేబియన్‌లో విజయోత్సహాం నిర్వహించుకుని, టీమ్ సుదీర్ఘ విరామం తరువాత ఆదివారం సాయంత్రం భారతదేశానికి బయలుదేరింది. ఆమ్‌స్టర్‌డామ్, బెంగళూరు మీదుగా ఈ బృందం అహ్మదాబాద్ చేరుకుంటుంది.
భారత సీనియర్ జట్టు కూడా ప్రస్తుతం అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడుతోంది. సీనియర్ జట్టు బయో బబుల్ వాతావరణంలో ఉంది. అండర్-19 ఆటగాళ్లకు సీనియర్ క్రికెటర్లతో సంభాషించే అవకాశం లభిస్తుందో లేదో ఇంకా తెలియదు. BCCI అధికారి మాట్లాడుతూ, “కుర్రాళ్లు చాలా బిజీ షెడ్యూల్ ముగించుకుని వస్తున్నారు. వారికి విశ్రాంతి తీసుకోవడానికి చాలా తక్కువ సమయం మాత్రమే లభించింది. భారతదేశం చేరుకున్న తర్వాత, పూర్తి విశ్రాంతి తీసుకునే అవకాశం లభిస్తుంది” అని అన్నారు.
ఫైనల్లో గెలిచిన తర్వాత, జట్టు ఆంటిగ్వా నుంచి గయానాకు బయలుదేరింది. అక్కడ భారత హైకమిషనర్ కేజే శ్రీనివాస్ టీంను సత్కరించారు. అలసిపోయినప్పటికీ, వేడుకకు హాజరైన వెస్టిండీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్ కర్ట్లీ ఆంబ్రోస్‌తో భారత ఆటగాళ్లు ఫోటోలు దిగారు. ఢిల్లీకి చెందిన కెప్టెన్ యశ్ ధుల్ నేతృత్వంలో భారత్ టైటిల్ గెలుచుకుంది. జట్టు ప్రధాన కోచ్ బాధ్యత హృషికేష్ కనిట్కర్ ఆధ్వర్యంలో అండర్ 19 ప్రపంచకప్ బరిలో నిలిచింది.
వీవీఎస్ లక్ష్మణ్ కీలక సలహాలు..
జాతీయ క్రికెట్ అకాడమీ అధిపతి VVS లక్ష్మణ్ కూడా జట్టుకు మార్గనిర్దేశం చేయడానికి కరీబియన్‌లో జట్టుతోపాటే ఉన్నారు. జట్టు ఆటగాళ్లు కోవిడ్ -19 బారిన పడినప్పుడు కూడా వారి సంరక్షణలో కీలక పాత్ర పోషించారు. ధుల్, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో సహా ఐదుగురు భారత ఆటగాళ్లకు కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించారు. గత నాలుగు టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన భారత్‌కు ఇది ఐదో టైటిల్.
No one is taking the trophy away from the India captain ?#U19CWC | #ENGvIND pic.twitter.com/GvYVAqMRQG
— ICC (@ICC) February 5, 2022
Also Read: Watch Video: రిషబ్ వద్దన్నా.. కోహ్లీ మాటనే ఫైనల్ చేసిన రోహిత్.. ఎందుకో తెలుసా? వైరలవుతోన్న వీడియో..!