Viral Photos: స్కాట్లాండ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోహ్లీసేన.. వైరలవుతోన్న డ్రెస్సింగ్ రూమ్ ఫొటోలు

|

Nov 06, 2021 | 6:40 AM

స్కాట్లాండ్ ఆటగాళ్లతో టీమిండియా ఆటగాళ్లు మైదానంలోనే కాదు.. డ్రెస్సింగ్ రూమ్‌నూ పంచుకున్నారు. మ్యాచ్ పూర్తయ్యాక కొన్ని టిప్స్ చెబుతూ సందడి చేశారు.

Viral Photos: స్కాట్లాండ్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోహ్లీసేన.. వైరలవుతోన్న డ్రెస్సింగ్ రూమ్ ఫొటోలు
Icc T20 World Cup 2021, Ind Vs Sco
Follow us on

T20 World Cup 2021: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లోని సూపర్ 12 దశలో గ్రూప్ 2 మ్యాచ్‌లో భాగంగా భారత్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచులో కోహ్లీసేన అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగించిన అనంతరం భారత ఆటగాళ్లు స్కాట్లాండ్ ఆటగాళ్లతో సరదాగా మాట్లాడారు. మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు బంతితో దడపుట్టించిన తరువాత కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించింది.

స్కాట్లాండ్‌పై 19 బంతుల్లో 50 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ కొంతమంది స్కాట్లాండ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. అత్యుత్తమ ఆటగాళ్లకు వ్యతిరేకంగా ఉన్నత స్థాయిలో ఎలా ఆడాలో వారితో పంచుకున్నారు.

క్రికెట్ స్కాట్లాండ్ మాత్రమే కాదు, భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో స్కాట్లాండ్ జట్టును కలిసిన ఫోటోలను క్రికెట్ స్కాట్లాండ్ సోషల్ మీడియాలో పంచుకుంది. “సమయం వెచ్చించినందుకు కోహ్లీసేనకు ధన్యవాదాలు. మాకిది ఇంది ఎంతో గౌరవం” అంటూ క్యాప్షన్ అందించారు.

86 పరుగుల ఛేజింగ్‌లో టీమిండియా ఓపెనర్లు టీ30 ప్రపంచ కప్‌లోనే ఫాస్టెస్ట్ టీమ్ ఫిఫ్టీని నమోదు చేసి, రికార్డులు నెలకొల్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచడానికి భారతదేశం 7.1 ఓవర్లలో 86 పరుగులను ఛేదించాల్సి ఉంది. కానీ, కోహ్లీ నేతృత్వంలోని జట్టు 6.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. “మేం ప్రారంభానికి ముందు 8-10 ఓవర్ల బ్రాకెట్ గురించే మాట్లాడుకున్నాం. ఈ సమయంలో వికెట్లు కోల్పోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వికెట్లు కోల్పోతే 20 బంతులు అదనంగా ఖర్చవుతాయి. రోహిత్, రాహుల్ సహజంగా ఆడితే త్వరగా పరుగులు వస్తాయని మేం భావించాం” అని విజయం తర్వాత కోహ్లీ వెల్లడించాడు.

అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకున్న కోహ్లీసేన ప్రస్తుతం ఆదివారం న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పై దృష్టి సారించారు. ఈ మ్యాచులో ఆఫ్గనిస్తాన్ టీం మ్యాచును గెలిస్తేనే భారత్ సెమీస్లోకి దూసుకెళ్తుంది. లేదంటే భారతదేశానికి తిరిగి రానుంది.

“ఆధిపత్య ప్రదర్శన, మేం మరలా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం 7వ తేదీన (నవంబర్) ఏమి జరుగుతుందో ఆసక్తికరంగా మారింది. నేటి పనితీరు గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. మేం ఏమి చేయగలమో మాకు తెలుసు” విజయం తర్వాత కోహ్లీ అన్నాడు.

“ఈ వేదికపై టాస్ ఎంత ముఖ్యమైనదో కూడా తెలియజేస్తుంది. మేం స్కాట్లాండ్ టీంను గరిష్టంగా 110-120 కంటే తక్కువ స్కోర్‌లో పరిమితం చేయాలనుకున్నాం. అదే మేం ఆలోచించాం. బౌలర్లు అద్భుతంగా ఆడారు. ఆపై కేఎల్ రాహుల్, రోహిత్ వారి బ్యాటింగ్‌లో మాయ చేశారు” అని కోహ్లీ తెలిపాడు.


Also Read: IND vs SCO Match Result: భారత ఓపెనర్ల దూకుడు.. కేవలం 39 బంతుల్లోనే ఘనవిజయం.. టాప్ 3కి చేరిన టీమిండియా

IND vs SCO Highlights, T20 World Cup 2021: 8 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఘన విజయం.. ఇక ఆశలన్నీ కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్‌పైనే..!