లండన్: 48 రోజుల వరల్డ్‌కప్ సంబరం ముగిసింది. ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి.. 27 ఏళ్ళ తర్వాత విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఈ మెగా టోర్నీలో అన్ని జట్ల నుంచి కొంతమంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఇక ఆ ఆటగాళ్లతో ఐసీసీ తమ వరల్డ్‌కప్ టీమ్‌ను ప్రకటించింది. 12 మంది పేర్లను ప్రకటించిన ఐసీసీ.. 11 మందితో టీమ్‌ను ప్రకటించింది. ఇక 12వ ఆటగాడిగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఎంపికయ్యాడు.
కాగా ఈ జట్టులో టీమిండియా నుంచి ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా చోటు దక్కించుకోగా.. కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ టీమ్‌లో చోటు దక్కపోవడం గమనార్హం. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కెప్టెన్‌గా.. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ కేరీని వికెట్ కీపర్‌గా ఐసీసీ ప్రకటించిన టీమ్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.
ఐసీసీ వరల్డ్‌కప్ జట్టు:
1. జేసన్ రాయ్(ఇంగ్లాండ్)
2. రోహిత్ శర్మ(భారత్)
3. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)
4. రూట్(ఇంగ్లాండ్)
5. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)
6. బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్)
7. అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా)
8. మిచెల్ స్టార్క్(ఆస్ట్రేలియా)
9. జోఫ్రా ఆర్చర్(ఇంగ్లాండ్)
10. ఫర్గుసన్(న్యూజిలాండ్)
11. జస్ప్రీత్ బుమ్రా(భారత్)
12. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్)
Find out the thinking behind the #CWC19 Team of the Tournament ? https://t.co/SFQPHYOXED
— ICC (@ICC) July 15, 2019