Champions Trophy 2025: పీసీబీకి హార్ట్ ఎటాక్.. భారత్ vs పాక్ మ్యాచ్ లాహోర్‌లో కాదు.. ఎక్కడ జరగనుందంటే?

|

Jul 06, 2024 | 12:59 PM

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఆతిథ్యమిచ్చేందు పాకిస్థాన్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన పనులు మొదలుపెట్టేసింది. ముఖ్యంగా షెడ్యూల్‌పై కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం టీమిండియా రాకపై తర్జనభర్జనలు పడుతోంది.

Champions Trophy 2025: పీసీబీకి హార్ట్ ఎటాక్.. భారత్ vs పాక్ మ్యాచ్ లాహోర్‌లో కాదు.. ఎక్కడ జరగనుందంటే?
Ind Vs Pak Match Stats
Follow us on

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ఆతిథ్యమిచ్చేందు పాకిస్థాన్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన పనులు మొదలుపెట్టేసింది. ముఖ్యంగా షెడ్యూల్‌పై కసరత్తులు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు ఐసీసీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం టీమిండియా రాకపై తర్జనభర్జనలు పడుతోంది. ఐసీసీకి ముసాయిదాను కూడా సమర్పించింది. దీని ప్రకారం లాహోర్‌లో టీమిండియా మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్తాన్‌కు వెళుతుందా లేదా అనేది తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్నగా మారింది. టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు వెళ్తుందా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

ప్రస్తుతం వినిపిస్తోన్న సమాచారం ప్రకారం ఈ నెలలో శ్రీలంకలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుందని తెలుస్తుంది. ఈ ట్రోఫీకి సంబంధించి ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని, అయితే జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రమే తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నెలలో శ్రీలంకలో ఐసీసీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఖచ్చితంగా టీమ్ ఇండియా పాకిస్తాన్ పర్యటన అంశాన్ని లేవనెత్తుతుంది. కాబట్టి శ్రీలంకలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి మాట్లాడే అవకాశం ఉంది.

శ్రీలంకలో సమస్యకు చెక్ పడే ఛాన్స్..

పాకిస్తాన్ ఆసియా కప్ 2023 ఆతిథ్యాన్ని కూడా పొందింది. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ మోడల్‌లో ఆడిన సంగతి తెలిసిందే. ఈమేరకు బీసీసీఐ అధికారులు మాట్లాడుతూ.. మాకు ఇంకా తెలియదు. దీనిపై మేం చర్చించలేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేం పాటిస్తాం. ఇది ICC ఈవెంట్. మేం టోర్నమెంట్ గురించి నిర్ణయాలు తీసుకోలేం. ఇది ఐసీసీ నిర్ణయం. భవిష్యత్తు గురించి చర్చించకు. వచ్చే ఐసీసీ సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కొన్ని విషయాలు స్పష్టం కానున్నాయి అంటూ తెలిపారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..