
ఐసీసీ షాకిచ్చింది. టీమిండియా, ఇంగ్లండ్‌లకు భారీ జరిమానాతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్ పాయింట్లలో కోత కూడా విధించింది. నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా, ఇంగ్లండ్ టీంలు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడమే ఇందుకు కారణం. దీంతో భారత్, ఇంగ్లండ్ క్రికెట్ల జట్లకు జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది. అలాగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్(2021-23)పాయింట్లలో రెండు పాయింట్లు కోత పెట్టింది. ఈమేరకు ఐసీసీ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మొదటి టెస్ట్‌లో వర్షం అడ్డంకితో మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకు చేతులెత్తేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 95 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 303 పరుగులకు ఆలౌట్ అవ్వగా, మొత్తంమీద 207 పరుగుల ఆధిక్యం సంపాధించింది. దీంతో 208 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్, పుజారా ఇద్దరు 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక ఆట ఐదవ రోజు భారీ వర్షం పడడంతో ఆరోజు ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
India Vs England: టీమిండియాలో రెండు మార్పులు.. మిడిల్ ఆర్డర్ మరింత బలం.. ఎవరెవరంటే.?