
ICC Bowling Ranking: ఐసీసీ తన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈసారి మూడు ఫార్మాట్లలో – టెస్ట్, వన్డే, టీ20లలో – ముగ్గురు వేర్వేరు బౌలర్లు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. టెస్టుల్లో భారత్‌కు చెందిన జస్ప్రీత్ బుమ్రా, వన్డేల్లో దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, టీ20లో న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ అగ్రస్థానంలో ఉన్నారు. ఏ ఫార్మాట్‌లో ఏ బౌలర్ నంబర్ 1గా ఉన్నాడో తెలుసుకుందాం.
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా ఆధిపత్యం
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్‌లో నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. అతడి వద్ద 889 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బుమ్రా కెరీర్లో అత్యధికంగా 908 రేటింగ్ పాయింట్లను 2025లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్టులో సాధించాడు. తన స్పెషల్ బౌలింగ్ శైలి, పర్ఫెక్ట్ యార్కర్లకు బుమ్రా ప్రసిద్ధి. అతని బౌలింగ్‌తో ఎన్నోసార్లు మ్యాచ్‌ను మలుపు తిప్పి భారత్‌కు విజయాన్ని అందించాడు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై అతడి ప్రదర్శన టీమిండియాకు పెద్ద బలంగా మారింది.
వన్డేలో కేశవ్ మహారాజ్ సత్తా
వన్డే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ కేశవ్ మహారాజ్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతనికి 671 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అతని కెరీర్లో అత్యధికంగా 741 రేటింగ్ పాయింట్లను 2023లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాపై సాధించాడు. మహారాజ్ తన కంట్రోల్డ్ బౌలింగ్, బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచేందుకు పేరుగాంచాడు. వన్డే క్రికెట్‌లో తన ఖచ్చితత్వం, ఓర్పుతో అనేక కీలక మ్యాచ్‌లలో తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు.
టీ20లో నంబర్ 1 స్థానానికి జాకబ్ డఫీ
టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. అతని ఖాతాలో 717 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అతని కెరీర్లో అత్యధికంగా 750 రేటింగ్ పాయింట్లను 2025లో హరారేలో దక్షిణాఫ్రికాపై సాధించాడు. డఫీ తన వేగవంతమైన బౌలింగ్, స్వింగ్, డెత్ ఓవర్లలో కంట్రోల్డ్కు పేరుగాంచాడు. అతని బౌలింగ్‌లో వైవిధ్యం బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..