Stuart Broad on Yuvraj’s 6 Sixes: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న యాషెస్ 5వ టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రకటించాడు. శనివారం జరిగిన 5వ టెస్ట్ 3వ రోజు ఆట తర్వాత బ్రాడ్ ఈ నిర్ణయాన్ని తెలిపాడు. 17 ఏళ్లుగా ఇంగ్లాండ్ తరఫున ఆడిన బ్రాడ్ ఆ దేశం తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే బ్రాడ్ కెరీర్ ఎలా ఉన్నా అతని గురించి తెలిసిన ఎవరికైనా యువరాజ్ సింగ్ గుర్తుకు రావాల్సిందే. వీరిద్దరి మధ్య అనుబంధం 2007 టీ20 వరల్డ్ కప్ నాటిది మరి. తొలి టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ అది. భారత్ తరఫున 19వ ఓవర్ సమయానికి క్రీజులో ఉన్న యువరాజ్‌ని అండ్రూ ఫ్లింటాఫ్ కవ్వించాడు. అంతే 19వ ఓవర్ వేయడానికి వచ్చిన బ్రాడ్‌ని యువీ 6 సిక్సర్లతో ఉతికేశాడు.
అయితే బ్రాడ్ తన కెరీర్‌ని ముగిస్తున్నట్లు ప్రకటించిన క్రమంలోనే యువీ 6 సిక్సర్లపై కూడా స్పందించాడు. దాని గురించి మాట్లాడుతూ ‘ఆ రోజు ఎంతో కఠినమైనది. ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయికి నేను సరిపోనేమోనని అనిపించింది. అప్పటికి నాకు పెద్దగా అనుభవం లేదు. దాని తర్వాతే నన్ను నేను వారియర్‌గా బిల్డ్ చేసుకోవడం ప్రారంభించా. ఏదైమైనప్పటికీ అలా జరగకుండా ఉంటే బాగుండేది. కానీ అదే చేదు అనుభవం నాలో కసిని పెంచి ఈ స్థాయి చేరేలా చేసిందేమో అనిపిస్తుంది. అది నన్ను ఎంతగానో ప్రేరేపించింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉండడం సహజం. వాటిని డీల్ చేస్తేనే మంచి రోజులు వస్తాయ’ని బ్రాడ్ చెప్పుకొచ్చాడు.
Stuart Broad talking about being hit for 6 sixes in an over against Yuvraj Singh.pic.twitter.com/TZPUUBuzjP
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 30, 2023
కాగా, స్టువర్ట్ బ్రాడ్ 602 టెస్టు వికెట్లు ఇంగ్లాండ్ తరఫున రెండో ఆటగాడిగా, 7వ అంతర్జాతీయ క్రికెటర్‌గా అరుదైన రికార్డ్‌ను ఇటీవలే సాధించాడు. అలాగే ఇంగ్లాండ్ జట్టు కోసం 167వ టెస్టు ఆడుతున్న అతను ఇప్పటివరకు 602 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టెస్టుల్లో 65 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ పేరిట ఓ సెంచరీ, 13 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..