Viral Video : ఐ లవ్ యూ శుభ్‌మన్ గిల్.. మ్యాచ్ జరుగుతుండగానే టీమిండియా కెప్టెన్‎కు ప్రపోజల్..వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉండటమే కాకుండా, అభిమానుల మనసుల్లోనూ తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మహిళా అభిమానుల నుంచి గిల్‌కు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా, వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో గిల్ బ్యాటింగ్ చేస్తుండగా స్టేడియంలో ఉన్న ఓ యువతి తన ప్రేమను వ్యక్త పరచడం చర్చనీయాంశమైంది.

Viral Video : ఐ లవ్ యూ శుభ్‌మన్ గిల్.. మ్యాచ్ జరుగుతుండగానే టీమిండియా కెప్టెన్‎కు ప్రపోజల్..వీడియో వైరల్
Shubman Gill (3)

Updated on: Oct 11, 2025 | 8:09 PM

Viral Video : టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో ఉండటమే కాకుండా, అభిమానుల మనసుల్లోనూ తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మహిళా అభిమానుల నుంచి గిల్‌కు లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. తాజాగా వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో గిల్ బ్యాటింగ్ చేస్తుండగా, స్టేడియంలో ఉన్న ఓ యువతి ఏకంగా ప్లకార్డ్ ద్వారా తన ప్రేమను వ్యక్తపరచడం చర్చనీయాంశమైంది. అద్భుతమైన సెంచరీతో అదరగొట్టిన గిల్‌కు లభించిన ఈ లవ్ ప్రపోజల్ వివరాలు, అతని అసాధారణ ప్రదర్శన గురించి ఈ వార్తలో తెలుసుకుందాం.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ రెండో రోజున ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ క్రీజులో ఉన్న సమయంలో గ్యాలరీలో కూర్చున్న ఓ యువతి తన చేతిలో ఉన్న ప్లకార్డును మైదానంలోకి ప్రదర్శించింది. ఆ ప్లకార్డుపై ఐ లవ్ యూ శుభ్‌మన్ గిల్ అని రాసి ఉంది. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కడంతో ఆ ఫోటోలు, వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. స్టేడియంలో గిల్‌కు అమ్మాయిలు ప్రేమను వ్యక్త పరచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ తన టెస్ట్ కెరీర్‌లో 10వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 196 బంతులను ఎదుర్కొని 16 ఫోర్లు, 2 సిక్సర్‌ల సహాయంతో అజేయంగా 129 పరుగులు చేశాడు. ఐదో వికెట్‌కు ధ్రువ్ జురెల్‌తో కలిసి 102 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత శుభ్‌మన్ గిల్ ఫామ్ మరింత మెరుగైంది. ఈ సెంచరీతో, గిల్ ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఐదు టెస్ట్ సెంచరీలు సాధించిన రెండవ భారత కెప్టెన్గా నిలిచాడు. గిల్ కంటే ముందు, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 2017, 2018 సంవత్సరాలలో రెండుసార్లు ఈ అరుదైన ఘనతను సాధించాడు.

కొన్ని నెలల క్రితమే భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితుడైన గిల్, ఆ తర్వాత T20 జట్టు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌కు అతన్ని వన్డే జట్టు కెప్టెన్‌గా కూడా నియమించారు. దీంతో భారత క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ యుగం ప్రారంభమైందని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విజయాల పరంపరలో అతని అభిమానుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..