
BCCI Jobs : బీసీసీఐ ప్రపంచంలోనే అతి పెద్ద, ధనిక క్రికెట్ బోర్డు. ఇండియాలో క్రికెట్‌కు సంబంధించిన అన్ని పనులూ BCCI చూసుకుంటుంది. దీని మెయిన్ ఆఫీస్ ముంబైలో ఉంది. ప్రస్తుతం రోజర్ బిన్నీ దీని ప్రెసిడెంట్. ఒక సాధారణ వ్యక్తి బీసీసీఐలో ఉద్యోగం చేయాలనుకుంటే అది చాలా కష్టం. కానీ సరైన అర్హతలు, అనుభవం ఉంటే సాధ్యమే. బీసీసీఐలో ఆటగాళ్లకు మాత్రమే కాదు, డాక్టర్లు, టెక్నికల్ నిపుణులు, ఇంకా చాలా మంది పని చేస్తారు. బీసీసీఐలో ఉద్యోగం ఎలా సంపాదించాలో, ముఖ్యంగా మీడియా మేనేజర్‌గా ఎలా అవ్వాలో వివరంగా తెలుసుకుందాం.
బీసీసీఐలో ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు
బీసీసీఐలో ఉద్యోగం రావాలంటే స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే, మార్కెటింగ్ గురించి బాగా తెలిసినా ఉద్యోగం రావొచ్చు. ఇక్కడ డిగ్రీలు, పీజీల కంటే అనుభవమే చాలా ముఖ్యం. క్రికెట్ గురించి మంచి అవగాహన ఉండాలి. ఉదాహరణకు, గతేడాది మార్కెటింగ్ విభాగంలో జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీ అయ్యింది. ఆ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు, మార్కెటింగ్, సేల్స్ రంగంలో 15 ఏళ్ల అనుభవం, ఒక టీమ్‌ను నడిపించిన అనుభవం ఉండాలని అడిగారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే, బీసీసీఐలో ఏ రంగంలో ఉద్యోగం చేయాలన్నా ఎక్స్ పీరియన్స్ మాత్రం తప్పనిసరి అని అర్థమవుతుంది.
మీడియా మేనేజర్ కావాలంటే?
ఒకరు బీసీసీఐలో మీడియా మేనేజర్‌గా పని చేయాలనుకుంటే, వారికి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అలాగే, ఏ విభాగంలో ఉద్యోగం ఉందో ఆ విభాగంలో 4 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం కావాలి. ప్రాజెక్ట్ మేనేజర్‌కు కూడా దాదాపు ఇదే అర్హతలు అవసరం.
బీసీసీఐలో లభించే ఇతర ఉద్యోగాలు
బీసీసీఐలో మార్కెటింగ్, మేనేజ్‌మెంట్, కోచింగ్, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ వంటి విభాగాలతో పాటు ఇంకా చాలా మంది పని చేస్తారు. ఫిజియోథెరపిస్ట్‌లు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు, అలాగే ఫైనాన్స్, వీడియో ఎడిటింగ్, సోషల్ మీడియా అకౌంట్స్ నిర్వహించే ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉంటాయి. రాష్ట్ర క్రికెట్ సంఘాలు కూడా బీసీసీఐ పరిధిలోకి వస్తాయి. కాబట్టి, ఆయా సంఘాలలో వచ్చే ఉద్యోగాలు కూడా బీసీసీఐలో ఉద్యోగాల కిందకే వస్తాయి.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..