Yuzvendra Chahal : క్రికెట్ టీం కొనుగోలు చేసిన చాహల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్..వామ్మో సౌండ్ పార్టీనే పట్టాడుగా
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ ప్రముఖ ఆర్జే మహవష్ ఛాంపియన్స్ లీగ్ టీ10లో ఒక క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసింది. చాహల్ విడాకుల తర్వాత ఆమెతో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Yuzvendra Chahal : భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ రేడియో జాకీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆర్జే మహవష్ కొంత కాలంగా వార్తల్లో నిలుస్తారు. మహవష్, చాహల్ మధ్య ఏదో ఉందని గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఛాంపియన్స్ ట్రోఫీ, డిన్నర్ అవుటింగ్‌లు, ఒక యాడ్ షూట్‌తో సహా చాలాసార్లు వీరిద్దరూ కలిసి కనిపించారు. ఈ పరిణామాల మధ్య ఆర్జే మహవష్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె ఒక క్రికెట్ జట్టుకు యజమాని అయ్యారు.
ఆర్జే మహవష్ ఛాంపియన్స్ లీగ్ T10 లో ఒక జట్టుకు సహ-యజమానిగా వాటా కొనుగోలు చేసింది. మహవష్ ఒక క్రికెట్ లీగ్‌లో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. అయితే, ఆమె జట్టు పేరు ఇంకా బయటపెట్టలేదు. ఛాంపియన్స్ లీగ్ T10 అనేది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన చాలా మంది స్టార్ ఆటగాళ్లు పాల్గొనే లీగ్. దీనితో పాటు లోకల్ టాలెంటుకు కూడా ఈ దిగ్గజాలతో ఆడే అవకాశం లభిస్తుంది. ఈ లీగ్ ఆగస్టు 22 నుండి 24 వరకు జరుగుతుంది. ఇందులో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి.
ఆర్జే మహవష్ భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో జాకీలలో, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లలో ఒకరు. ఆమె సినిమా నిర్మాత, కంటెంట్ క్రియేటర్, రచయిత్రిగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆర్జే మహవష్ అలీగఢ్‌లో పుట్టారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2025లో ఆమె హిందీ డ్రామా సిరీస్ ‘ప్యార్ పైసా ప్రాఫిట్’ కూడా అభిమానుల ప్రశంసలు అందుకుంది.
ఇటీవలే యుజ్వేంద్ర చాహల్ ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో తన సంబంధం గురించి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఈ షోలో చాహల్ సరదాగా తన సంబంధం గురించి మాట్లాడుతూ.. భారతదేశం మొత్తానికి తెలుసు అని అన్నాడు. ఈ వ్యాఖ్య అభిమానుల మధ్య వారి సంబంధంపై అంచనాలను మరింత పెంచింది. అయితే, ఇప్పటివరకు యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహవష్ తమ సంబంధాన్ని ధృవీకరించలేదు. కానీ, ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత చాహల్ చాలాసార్లు ఆర్జే మహవష్‌తో కలిసి కనిపించాడు.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ చేయండి..




