మాంచెస్టర్‌లో అత్యధిక, అత్యల్ప స్కోర్లు ఇవే!

|

Jun 16, 2019 | 4:58 PM

మాంచెస్టర్‌: ఎట్టకేలకు వరుణుడు దయ తలవడంతో వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ మ్యాచ్ ఇప్పటివరకు ఎటువంటి ఆటకం లేకుండా సాగుతోంది. భారత్ ఓపెనర్లు శుభారంభం చేయగా..కేఎల్ రాహుల్ 57 పరుగులు చేసి పెవిలీయన్ చేరగా రోహిత్ శర్మ సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. అయితే ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్‌ గతంలో ఇంగ్లాండ్‌ మరియు శ్రీలంక మధ్య 318/7గా నమోదవగా.. ఇంగ్లాండ్‌, కెనడా మధ్య అత్యల్ప స్కోర్‌ 45/10 రికార్డు ఉంది. అయితే ఇదే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు, […]

మాంచెస్టర్‌లో అత్యధిక, అత్యల్ప స్కోర్లు ఇవే!
Follow us on

మాంచెస్టర్‌: ఎట్టకేలకు వరుణుడు దయ తలవడంతో వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ మ్యాచ్ ఇప్పటివరకు ఎటువంటి ఆటకం లేకుండా సాగుతోంది. భారత్ ఓపెనర్లు శుభారంభం చేయగా..కేఎల్ రాహుల్ 57 పరుగులు చేసి పెవిలీయన్ చేరగా రోహిత్ శర్మ సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు.

అయితే ఈ స్టేడియంలో అత్యధిక స్కోర్‌ గతంలో ఇంగ్లాండ్‌ మరియు శ్రీలంక మధ్య 318/7గా నమోదవగా.. ఇంగ్లాండ్‌, కెనడా మధ్య అత్యల్ప స్కోర్‌ 45/10 రికార్డు ఉంది. అయితే ఇదే ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన పోరులో 286/4 అత్యధిక ఛేదనగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత బ్యాట్స్‌మెన్‌ని పాక్‌ బౌలర్లు కట్టడి చేస్తారా లేక పాక్‌ బ్యాట్స్‌మెన్‌ని టీమిండియా బౌలింగ్‌ కట్టడిచేస్తుందా చూడాలి. వర్షం కురవకపోతే పూర్తిస్థాయి మ్యాచ్‌ జరిగే అవకాశముంది. చాలా మంది అభిమానులు ఇక్కడ వర్షం పడొద్దని దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.