
India vs South Africa, 1st T20I: కటక్ లోని బారాబతి స్టేడియంలో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికాకు 176 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది.
భారత జట్టు తరపున హార్దిక్ పాండ్యా 59 పరుగులు (28 బంతులు) చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 25 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా, పాండ్యా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 100 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు.
పాండ్యా కాకుండా తిలక్ వర్మ 26, అక్షర్ పటేల్ 23 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 17, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు చేశారు.
దక్షిణాఫ్రికా తరపున లుంగి న్గిడి మూడు వికెట్లు పడగొట్టాడు. లూథో సిపామ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. డోనోవన్ ఫెర్రీరా ఒక వికెట్ పడగొట్టాడు
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..