
చాలామంది ఆయన స్టైల్, హెయిర్ కట్ గురించి మాట్లాడుకుంటారు కానీ, ఆ పర్‌ఫెక్ట్ ఫిజిక్ వెనుక ఆయన పడే కష్టం ఎవరికీ తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన డైలీ రొటీన్ గురించి వివరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన రోజు కేవలం జిమ్‌తో మాత్రమే మొదలవ్వదు.. అందులో ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత, కఠినమైన ఆహార నియమాలు కూడా ఉన్నాయి. హార్దిక్ పాండ్యాను ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉంటే ఆ అద్భుతమైన ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..
హార్దిక్ పాండ్యా తన రోజును ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ప్రారంభిస్తారు. రోజును సానుకూలంగా మొదలుపెట్టడానికి ఆయన హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆ తర్వాత చన్నీటి స్నానం చేస్తారు, ఇది శరీరాన్ని తక్షణమే ఉత్తేజితం చేసి నిద్రమత్తును వదిలిస్తుంది. ఉదయం పూట దాదాపు 60 నిమిషాల పాటు యోగా, మరో 30 నిమిషాల పాటు ధ్యానం చేయడం ఆయనకు అలవాటు. ఇది ఆయన శరీరానికి ఫ్లెక్సిబిలిటీని, మనసుకు ఏకాగ్రతను ఇస్తుంది.
క్రికెటర్లకు స్ట్రెంగ్త్ ఎంత ముఖ్యమో, ఎండ్యూరెన్స్ కూడా అంతే ముఖ్యం. అందుకే హార్దిక్ తన వర్కవుట్లను రెండు భాగాలుగా విభజించుకున్నారు. ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మరియు పవర్ బిల్డింగ్ వ్యాయామాలు చేస్తారు. అలాగే, సాయంత్రం 4 నుండి 6:30 గంటల వరకు ఫంక్షనల్ మూవ్‌మెంట్ మరియు ఎక్స్‌ప్లోజివ్‌నెస్ మెరుగుపరిచే వర్కవుట్స్ చేస్తారు.
Hardik Pandya1
ఇవి మైదానంలో చురుగ్గా కదలడానికి ఆయనకు సహాయపడతాయి. ఫిట్‌నెస్ అంటే కేవలం కష్టపడటమే కాదు, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అని హార్దిక్ నమ్ముతారు. వర్కవుట్ల తర్వాత ఆయన చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటారు, అవసరమైతే కాసేపు కునుకు తీస్తారు. దీనివల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి. గాయాల బారిన పడకుండా ఉండటానికి ప్రతిరోజూ స్ట్రెచింగ్ చేయడం ఆయన దినచర్యలో భాగం.
బలంగా ఉండటంతో పాటు లీన్‌గా కనిపించడానికి హార్దిక్ హై-ప్రోటీన్, లో-క్యాలరీ డైట్ పాటిస్తారు. ఉదయం ప్రోటీన్ షేక్స్ లేదా స్మూతీస్, మధ్యాహ్నం పప్పు, పాలకూర, అన్నం వంటి స్వచ్ఛమైన భారతీయ భోజనం, సాయంత్రం కూరగాయలు లేదా టోఫు వంటి తేలికపాటి ఆహారం తీసుకుంటారట. ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతూ ఆకలిని నియంత్రించుకుంటారట. ఇక, శారీరక శిక్షణతో పాటు మానసిక దృఢత్వం కోసం హార్దిక్ ప్రతిరోజూ డైరీ రాస్తారు లేదా పుస్తకాలు చదువుతారు.
Hardik Pandya2
ఇది మ్యాచ్ సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గించుకోవడానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ఆయనకు సహాయపడుతుంది. కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా ఆయన ఎంతో విలువైనదిగా భావిస్తారు. హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ రొటీన్ చూస్తుంటే, విజయం అనేది కేవలం అదృష్టం వల్ల రాదు, అది కఠినమైన క్రమశిక్షణ మరియు ప్లానింగ్ వల్ల వస్తుందని అర్థమవుతుంది. యోగా, మెడిటేషన్, సరైన డైట్ కలిపిన ఆయన లైఫ్ స్టైల్ ఎందరో యువకులకు స్ఫూర్తిదాయకం.