హార్దిక్.. హార్దిక్.. హార్దిక్.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎక్స్‌పర్ట్స్ సైతం ఈ ప్లేయర్ జపమే చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా, టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఔట్ అయిన తీరు చర్చనీయాంశంగా మారింది. థర్డ్ అంపైర్ చెత్త నిర్ణయం వల్ల వెనుదిరిగిన పాండ్యా అసలు ఔటా..? లేక నాటౌటా..? అన్న సందేహం తెరమీదికి వచ్చింది. డారిల్ మిచెల్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో నాలుగో బంతిని పాండ్యా ఫ్లిక్ చేయబోయి మిస్ అయ్యాడు. దీంతో బంతి కీపర్ టామ్ లాథమ్ చేతుల్లో వచ్చింది. ఆ వెంటనే బెయిల్స్ కూడా కిందపడ్డాయి.
అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పాండ్యా ఔట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా బంతి ఎక్కడా నేరుగా వికెట్లను తాకినట్లుగా కనిపించలేదు. అయితే కీపర్ టామ్ లాథమ్ గ్లోవ్స్ మాత్రం వికెట్లను తాకినట్లు కనిపించింది. అదే సమయంలో బంతి కూడా లాథమ్ చేతుల్లో పడింది. లాథమ్ బంతి అందుకోకముందే బెయిల్స్ ఎగురగొట్టినట్లు పరిగణించిన థర్డ్ అంపైర్ పాండ్యాను బౌల్డ్‌గా ప్రకటించి ఔట్ ఇచ్చాడు. అంతే కివీస్ ఆటగాళ్లు సంబరాలు జరుపుకోగా.. షాకవడం పాండ్యా వంతైంతి.
How is this even OUT!! @ICC #INDvsNZ #HardikPandya pic.twitter.com/uT21O8Xxx5
— cric guru (@bccicc) January 18, 2023
హార్దిక్ పాండ్యా ఔట్‌పై అభిమానులు మండిపడుతున్నారు. హార్దిక్ పాండ్యా నాటౌట్ అని సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులు నమ్ముతున్నారు. అయితే అంపైర్ తప్పిదం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ తిరిగి పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అంపైర్ నిర్ణయంపై హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే తన స్పందనను వెళ్లడించారు.
అసలైన, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ కట్ షాట్ కొట్టాలనుకున్నాడు, కానీ అతను మిస్ అయ్యాడు. ఆ తర్వాత బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే టామ్ లాథమ్ ఔటయ్యాడు. ఆ తర్వాత తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌కు వెళ్లింది. అయితే హార్దిక్ పాండ్యా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం