Hardik Pandya : కేవలం 17 పరుగుల దూరంలో.. ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానుంది. ఇందులో భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చరిత్రలో తన పేరు లిఖించుకోవడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందాడు.

Hardik Pandya : కేవలం 17 పరుగుల దూరంలో.. ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు
Hardik Pandya

Updated on: Sep 06, 2025 | 12:13 PM

Hardik Pandya : ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ప్రారంభమవుతుంది. టీమిండియా సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ టోర్నమెంట్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం 17 పరుగుల దూరంలోనే హార్దిక్.. చరిత్రలో తన పేరు లిఖించుకోనున్నాడు.

హార్దిక్ పాండ్యాకు అరుదైన అవకాశం..

ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో హార్దిక్ ఇప్పటివరకు 83 పరుగులు చేసి, 11 వికెట్లు తీసుకున్నాడు. మరో 17 పరుగులు చేస్తే, ఈ ఫార్మాట్‌లో 100 పరుగులు, 10+ వికెట్లు సాధించిన మొదటి ఆటగాడిగా హార్దిక్ నిలుస్తాడు. సీనియర్ ఆటగాడిగా, బ్యాట్, బాల్‌తో హార్దిక్ పాత్ర టీమిండియా టైటిల్ డిఫెన్స్‌లో చాలా కీలకం. జట్టు సమతూల్యతకు అతను చాలా ముఖ్యమైన ఆటగాడు. అతని ప్రదర్శనపై అభిమానులు కూడా నిఘా ఉంచారు.

భారత్ – పాకిస్థాన్ మధ్య హై-ఓల్టేజ్ మ్యాచ్..

భారత జట్టు రెండవ గ్రూప్ మ్యాచ్ సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత భారత్ సెప్టెంబర్ 19న ఒమన్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. రెండు మ్యాచ్‌లు గెలిస్తే సూపర్ ఫోర్ బెర్త్‌ను ఖరారు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఉన్న భారత జట్టు, ఈ టోర్నమెంట్‌లో తమ ప్రస్థానాన్ని అద్భుతంగా ప్రారంభించాలని చూస్తుంది.

కెప్టెన్సీ కోల్పోయినా.. సైలెంట్​గా హార్దిక్

ఒకప్పుడు రోహిత్ శర్మకు వారసుడిగా భావించిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు భారత నాయకత్వ బృందంలో లేడు. ఆసియా కప్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభమన్ గిల్ డిప్యూటీగా వ్యవహరిస్తున్నారు. వైస్ కెప్టెన్సీని కోల్పోయినప్పటికీ, హార్దిక్ ఈ విషయంపై మౌనంగా ఉండి తన ఆటపై దృష్టి పెట్టాడు. అతను ఆడిన 114 టీ20లలో 141.67 స్ట్రైక్ రేట్‌తో 1812 పరుగులు చేసి, 94 వికెట్లు తీసుకున్నాడు. అతని ఉనికి ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయానికి చాలా ముఖ్యం.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్, గురువారం సాయంత్రం దుబాయ్ చేరుకున్నాడు. శుక్రవారం నుంచి ఈ టోర్నమెంట్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. హార్దిక్ పాండ్యా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌పై భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా రాణించాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌ను క్వాలిఫైయర్ 2 వరకు నడిపించాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..