India vs Pakistan, 28 August: రాబోయే ఆసియా కప్ (Asia Cup-2023) పాకిస్థాన్, శ్రీలంకలో జరగనుంది. ఈ టోర్నీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 30 నుంచి ఈ టోర్నీ మొదలుకానుంది. రేపు టీమిండియా శ్రీలంకకు బయల్దేరనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు అంటే భారత్ వర్సెస్ పాకిసాన్ టీంల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అంతకుముందు ఇదే రోజున అంటే ఆగస్ట్ 28న హార్దిక్ పాండ్యా ఆసియా కప్‌లోనే భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని మీకు తెలుసా. దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టి టీమిండియాను గెలిపించాడు. హార్దిక్ బాదిన ఈ లాంగ్ సిక్స్‌ను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
28 ఆగస్టు 2022న టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ 43 పరుగులు చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతనికి తోడు ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. భారత్ తరపున పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు.
ASIA CUP 2022. 18.6: Haris Rauf to Hardik Pandya 4 runs, India 141/4 https://t.co/00ZHI9O18V #INDvPAK #AsiaCup2022
— BCCI (@BCCI) August 28, 2022
148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్ కేవలం 1 పరుగుకే పడింది. కేఎల్ రాహుల్ (0)ను నసీమ్ షా బౌల్డ్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (12), విరాట్ కోహ్లీ (35) రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. విరాట్ 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 18 పరుగులు మాత్రమే చేశాడు.
Kung-fu Pandya pic.twitter.com/aENN1ZMhOU
— Just❤️🏏 (@Just80332758) August 28, 2022
చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో రవీంద్ర జడేజా (35), హార్దిక్ పాండ్యా ఉన్నారు. హారిస్ రవూఫ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి జడేజా సింగిల్ తీశాడు. ఆ తర్వాత జడేజా మూడో, నాలుగో, చివరి బంతికి ఫోర్లు బాది పాకిస్తాన్ లయను చెడగొట్టాడు. చివరి ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సి ఉండగా మహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికే జడేజా ఔటయ్యాడు. నాలుగో బంతికి హార్దిక్ పాండ్యా భారీ సిక్సర్ కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 33 పరుగులు చేసి నాటౌట్ గా వెనుదిరిగాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..