India Vs Bangladesh: తక్కువ అంచనా వెయ్యొద్దు.. రోహిత్ శర్మకు స్వీట్ వార్నింగ్

|

Sep 02, 2024 | 11:49 AM

సెప్టెంబరులో భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు. టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లా ఆటగాళ్లు భారత్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని..

India Vs Bangladesh: తక్కువ అంచనా వెయ్యొద్దు.. రోహిత్ శర్మకు స్వీట్ వార్నింగ్
Rohit Sharma
Follow us on

సెప్టెంబరులో భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మను మాజీ క్రికెటర్లు సున్నితంగా హెచ్చరించారు. టెస్ట్‌ సిరీస్‌లో బంగ్లా ఆటగాళ్లు భారత్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని.. వారిని తక్కువ అంచనా వేయొద్దని మాజీ ఆటగాళ్లు సురేశ్‌ రైనా, హర్భజన్ సింగ్‌ వ్యాఖ్యానించారు. ఎన్ని రాజకీయ గందరగోళాలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌ తమ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోదని అన్నారు. గతవారం రావల్పిండిలో జరిగిన తొలి టెస్ట్‌లోనే పాకిస్థాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

భారత స్టార్‌ ప్లేయర్స్‌ దులీప్ ట్రోఫీని ఆడటం బీసీసీఐ తీసుకున్న ఒక మంచి నిర్ణయమని అన్నారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో క్రికెట్ ఆడినప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయి. బంగ్లాదేశ్‌ను తేలికగా తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వారికి స్పిన్నర్స్‌తో పాటు సుదీర్ఘ కాలంగా ఆటలో అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఈ సిరీస్ చక్కటి మ్యాచ్ ప్రాక్టీస్ అవుతుంది’’ అని రైనా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మరో మాజీ ప్లేయర్‌ హర్భజన్‌ కూడా సమర్ధించారు.

కాగా, చెన్నై, కన్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక్కడ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. బంగ్లాదేశ్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చే స్పిన్నర్లు ఉన్నారు. దాంతో ఇది ఆసక్తికరమైన సిరీస్‌గా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ జరగనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..