Harbhajan Singh: కప్ గెలవకపోతే ఏంది?..విరాట్‌ను వెనకేసుకొచ్చిన హర్భజన్

రన్ మిషిన్ విరాట్ కోహ్లీ గూర్చి టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమ్‌ను నడిపించిన తీరు అద్భుతమని కొనియాడారు. స్వదేశంలోనే కాకుండా విదేశీ స్టేడియంలో కూడా విజయం సాధించాలనే కసిని విరాట్ ప్లేయర్లలో పెంచినట్లు పేర్కొన్నాడు.

Harbhajan Singh: కప్ గెలవకపోతే ఏంది?..విరాట్‌ను వెనకేసుకొచ్చిన హర్భజన్
Harbhajan Singh Praises Vir

Updated on: Oct 04, 2024 | 4:49 PM

రన్ మిషిన్ విరాట్ కోహ్లీ గూర్చి టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూల్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమ్‌ను నడిపించిన తీరు అద్భుతమని కొనియాడారు. స్వదేశంలోనే కాకుండా విదేశీ స్టేడియంలో కూడా విజయం సాధించాలనే కసిని విరాట్ ప్లేయర్లలో పెంచినట్లు పేర్కొన్నాడు. దీనికి ఉదాహరణ 2021, 2022లో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోపీనే అని చెప్పుకొచ్చారు.

విరాట్ నాయకత్వంలో ఐపీఎల్‌లో ఒక్క ట్రోపీ గెలవకపోతే గొప్ప కాకుండా పోడని స్పష్టం చేశారు. కోహ్లీ టీమ్‌లోని ఆటగాళ్లకు కసితో ఎలా ఆడాలో నేర్పించిన్నట్లు చెప్పారు. లాస్ట్ వరకు మ్యాచ్‌లో ఎలా పోరాడాలో ప్లేయర్స్‌కి నేర్పించినట్లు చెప్పుకొచ్చారు. గబ్బాలో పంత్, గిల్ ఆడిన తీరు ఎవరు మర్చిపోలేరని పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌ల తర్వాత భారత ఆటగాళ్లు ఆడే తీరు పూర్తిగా మారిపోయిందన్నారు. విదేశీ గడ్డలో ప్రత్యర్థులు భయపడేలా కోహ్లీ చేశాడన్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో తొలిసారి విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్ గెలిచింది. ఆ తర్వాత 2021-22లో మళ్లీ ట్రోఫీ గెలిచింది. మరోసారి కూడా కప్ కొట్టాలని కసితో టీమిండియా ఉంది. నవంబర్‌లో ఆసీస్‌తో జరగునున్న ఐదు టెస్టుల సిరీస్‌కు భారత్ సిద్దమవుతుంది. కాగా 30 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా ఆసీస్ భారత్ ఐదు టెస్ట్ సిరీస్ జరుగుతుండడం విశేషం.