Harbhajan Singh: అనుష్క, అతియాలపై బజ్జీ షాకింగ్‌ కామెంట్స్‌.. మండిపడుతోన్న నెటిజన్స్‌..

|

Nov 20, 2023 | 9:38 AM

ఆదివారం రాత్రి జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఈ వివాదానికి వేదికగా మారింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెటర్ల భార్యలు కూడా మ్యాచ్‌ను వీక్షించారు. వీరిలో విరాట్‌ కోహ్లీ భార్య నటి.. అనుష్క శర్మతో పాటు, కేఎల్‌ రాహుల్‌ సతీమణి అతియా షెట్టీకూడా ఉన్నారు...

Harbhajan Singh: అనుష్క, అతియాలపై బజ్జీ షాకింగ్‌ కామెంట్స్‌.. మండిపడుతోన్న నెటిజన్స్‌..
Harbhajan Singh
Follow us on

సెలబ్రిటీలు మాట్లాడే ప్రతీ మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారు చేసే వ్యాఖ్యలు కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తాయి. ముఖ్యంగా నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తులు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుంటాయి. తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, విమర్శలు ఎదుర్కొన్నాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌.

ఆదివారం రాత్రి జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఈ వివాదానికి వేదికగా మారింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు సినీ, రాజకీయ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇండియన్ క్రికెటర్ల భార్యలు కూడా మ్యాచ్‌ను వీక్షించారు. వీరిలో విరాట్‌ కోహ్లీ భార్య నటి.. అనుష్క శర్మతో పాటు, కేఎల్‌ రాహుల్‌ సతీమణి అతియా షెట్టీకూడా ఉన్నారు.

హర్భజన్ వివాదాస్పద వ్యాఖ్యలు..

అయితే మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. అదే సమయంలో వీరిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ హిందీ వ్యాఖ్యాతగా వ్యహరించాడు. అయితే అనుష్క, అతియా షెట్టీ మాట్లాడుకుంటున్న విషయంపై బజ్జీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బజ్జీ మాట్లాడుతూ.. ‘వాళ్లకు క్రికెట్ గురించి పెద్దగా ఏమీ తెలిసి ఉండదు. బహుశా సినిమాల గురించి మాట్లాడకుంటూ ఉండి ఉంటారు’ అని వ్యాఖ్యానించాడు.

ఇంకేముంది బజ్జీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. ఇక మరికొందరైతే ఏకంగా పురుష దురహంకార వ్యాఖ్యలు అంటూ విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు తలదించుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ వివాదానికి బజ్జీ ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..