ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ సభ్యులు శుభాకాంక్షలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కోహ్లీ తన భార్య అనుష్క శర్మ కూడా క్షిణాఫ్రికాలోనే ఉన్నారు. టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ జనవరి 3న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కోహ్లీ “కొత్త సంవత్సరం మనందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ శుభాకాంక్షలు.” అని కోహ్లీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ట్విటర్‌లో భారత జట్టుతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ” కొత్త సంవత్సరం కొత్త ఆశలు! మీ అందరికీ 2022 సంతోషంగా సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని క్యాప్షన్ పెట్టాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రతి ఒక్కరికీ “2022 కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
New year new hopes! Wish you all a happy and prosperous 2022. #HappyNewYear pic.twitter.com/cssKEpeePI
— Ashwin ?? (@ashwinravi99) December 31, 2021
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అతను “#హ్యాపీ న్యూ ఇయర్! 2022లో ప్రవేశించడం ఇలా ఉంటుంది… డ్యాన్స్ చిట్కాలకు ధన్యవాదాలు @RanveerOfficial. 2022 మీలో ప్రతి ఒక్కరికీ అద్భుతమైన, ఆరోగ్యకరమైన, స్ఫూర్తిదాయకమైన సంవత్సరంగా ఉండాలని” రాశాడు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత, భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
Getting into 2022 be like…thanks for the dance tips @RanveerOfficial. May 2022 be a wonderful, healthy, and inspiring year for each of you ?? pic.twitter.com/EvyTa7Ev4V
— Ravi Shastri (@RaviShastriOfc) January 1, 2022
Read Also.. Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌పై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ ప్రశంసలు.. అద్భుతాలు చేస్తాడని వ్యాఖ్యలు..