GT vs RR Score: సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌‌కే కుప్పకూలిన రాజస్థాన్.. టార్గెట్ ఎంతంటే?

|

May 29, 2022 | 10:05 PM

Gujarat Titans vs Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ టీం నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 131 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

GT vs RR Score: సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. తక్కువ స్కోర్‌‌కే కుప్పకూలిన రాజస్థాన్.. టార్గెట్ ఎంతంటే?
Gujarat Titans Vs Rajasthan Royals
Follow us on

Gujarat Titans vs Rajasthan Royals: ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్ గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. టాస్‌ గెలిచిన సంజూ శాంసన్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. 20 ఓవర్లలో రాజస్థాన్ జట్టు 9 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 131 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

రాజస్థాన్ తరఫున జోస్ బట్లర్ అత్యధిక పరుగులు చేశాడు. 35 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అదే సమయంలో గుజరాత్ తరఫున హార్దిక్ పాండ్యా అత్యధిక వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ కెప్టెన్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అదే సమయంలో సాయి కిషోర్ ఖాతాలో 2 వికెట్లు పడ్డాయి.