ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా పుణేలో జరిగిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 బంతుల్లో 84 (6×4, 4×6) పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 31 పరుగులు, మిల్లర్ 20 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజర్ మూడు వికెట్లు, అహ్మద్ 2, కుల్దీప్ యాదవ్ వికెట్ పడగొట్టారు.
పాండ్యా సీఫర్ట్ (3)ను ఔట్ చేయడం ద్వారా హార్దిక్ ఢిల్లీ పతనాన్ని ప్రారంభించగా.. అయిదో ఓవర్లో పృథ్వీ షా (10), మన్‌దీప్ (18)లను ఔట్ చేసి ఫెర్గూసన్ ఢిల్లీని కష్టాల్లోకి నెట్టాడు. కెప్టెన్ పంత్, లలిత్ యాదవ్ నిలబడడంతో ఆ జట్టు కాస్త కోలుకుంది. లలిత్ రనౌట్ అవడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది. సాధించాల్సిన రన్‌రేట్ మరీ ఎక్కువేమీ లేకపోయినా ఢిల్లీ క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఫెర్గూసన్ 15వ ఓవర్లో పంత్, అక్షర్ పటేల్ (8) ఔట్ చేసి ఆ జట్టును గట్టి దెబ్బతీశాడు. హిట్టర్ పావెల్ సహా ఎవరూ ఆ జట్టును ఆదుకోలేకపోయారు. శార్దూల్ (2)ను రషీద్ ఔట్ చేయగా.. 18వ ఓవర్లో పావెల్, ఖలీల్‌లను షమి వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైపోయింది. రిషబ్ పంత్ 43 పరుగులు చేయగా.. లలిత్ యాదవ్ 25, పావెల్ 20 పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఫెర్గూసన్ 4 వికెట్లు తీయగా మహ్మద్ షమీ 2, పాండ్యా, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Read Also.. MI vs RR Result, IPL 2022: రోహిత్ సేనకు షాకిచ్చిన రాజస్థాన్.. థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఘన విజయం..