Chris Gayle: క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడా.. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎందుకు అలా చేశారు..

|

Nov 06, 2021 | 8:11 PM

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎడమ చేతి వాటం బ్యాటర్ క్రిస్ గేల్‎కు సహచరుల నుంచి స్టాండింగ్​ ఒవేషన్ లభించింది. దీన్ని బట్టి గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై గేల్ ఎలాంటి అధికారిక ప్రకట చేయలేదు...

Chris Gayle: క్రిస్ గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడా.. వెస్టిండీస్ ఆటగాళ్లు ఎందుకు అలా చేశారు..
Gyle
Follow us on

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఎడమ చేతి వాటం బ్యాటర్ క్రిస్ గేల్‎కు సహచరుల నుంచి స్టాండింగ్​ ఒవేషన్ లభించింది. దీన్ని బట్టి గేల్ రిటైర్మెంట్ తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై గేల్ ఎలాంటి అధికారిక ప్రకట చేయలేదు. అతను పెవిలియన్‎కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకులకు బ్యాట్‎తో అభివాదం కూడా చేశాడు. ఈ మ్యాచ్‎లో గేల్ తొమ్మిది బంతుల్లో 15 పరుగుల చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్‎లో ఔటయ్యాడు. గేల్ ఔటై వెళ్తుంటే.. “వెస్టిండీస్ రంగుల్లో క్రిస్ గేల్‌ను చూడటం ఇదే చివరిసారి అని మనకు తెలుస్తుందని. అతని సహచరులు అతనిని ప్రశంసించారు” అని వ్యాఖ్యాత బిషప్ లైవ్ ఆన్ ఎయిర్ చెప్పారు.

క్రిస్ గేల్ 1999లో అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్​ రెండుసార్లు ప్రపంచకప్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గేల్..79 టీ20ల్లో 1899 పరుగులు చేశాడు. అందులో 14 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్ తరఫున గేల్ 103 టెస్టులు ఆడి 7215 పరుగులు చేశాడు. 301 వన్డేల్లో 10,480 పరుగులు సాధించాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 259 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‎లో డ్వేన్ బ్రావో చివరిగా ఆడాడు. అతను శ్రీలంక మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈమ్యాచ్‎లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. లూయిస్ 26 బంతుల్లో 29(ఐదు ఫోర్లు) పరుగులు, పోలార్డ్ 31 బంతుల్లో44(నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించారు. చివర్లో రసెల్ 7 బంతుల్లో 18(ఒక ఫోర్, రెండు సిక్స్‎లు) పరుగులు చేసిన నాటౌట్‎గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్​వుడ్ 4 వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, జంపా ఒక్కో వికెట్ తీశారు.

158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‎లో చెలరేగాడు. 56 బంతుల్లో 89(9 ఫోర్లు, 4 సిక్స్‎లు) పరుగులతో నాటౌట్‎గా నిలిచి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. మార్ష్ 32 బంతుల్లో53 (5 ఫోర్లు, 2 సిక్స్‎లు ) పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 9 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, హోసెయిన్ ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్‎లో భారీ సిక్సర్ కొట్టిన రసెల్.. ఎంత దూరం వెళ్లిందంటే..