
Glenn Maxwell Retirement: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2026 ఫిబ్రవరిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అతడు ఆస్ట్రేలియా తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఈ నిర్ణయంతో 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడినట్లయింది.
లిస్ట్ ఏ, దేశవాళీ టీ20 టోర్నీల్లో మెరుగైన ఫామ్‌తో 2012లో వన్డే, టీ20 ఫార్మాట్లలో మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో మొత్తం 286 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో వన్డేల్లో 3,990 పరుగులు, టీ20ల్లో 2,897 పరుగులు సాధించాడు.
గత రెండేళ్లుగా మ్యాక్స్‌వెల్ ప్రదర్శన నిరాశపరిచింది. 2025లో వన్డేల్లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులే చేశాడు. 2026లో టీ20ల్లో చేసింది 62 పరుగులే. బౌలింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో ఫిబ్రవరి తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ప్లేయింగ్ XIలో చోటు దక్కించుకోలేకపోయాడు. పేలవ ప్రదర్శనల కారణంగా జట్టు మేనేజ్‌మెంట్ క్రమంగా అతడి నుంచి దూరం జరిగి ఉండొచ్చని అంచనా.
ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ గోల్ఫ్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అతడు చివరిసారిగా ఆస్ట్రేలియా వన్డే కప్‌లో విక్టోరియా తరఫున ఆడాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో బెల్‌ఫాస్ట్ వోల్వ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో 27.22 సగటుతో 245 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు కూడా తీశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా మ్యాక్స్‌వెల్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతాడు.
బిగ్ బాష్ లీగ్ (BBL)లో మెల్‌బోర్న్ స్టార్స్‌తో రెండేళ్ల ఒప్పందం ఉంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో హైదరాబాద్ కింగ్స్‌మెన్ తరఫున ఆడతాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL), ETPL తదుపరి సీజన్, మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లోనూ కనిపిస్తాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..