బాబోయ్.. గంభీర్ నాపై ఫుల్ ప్రెజర్ పెట్టేస్తున్నాడు.. 2వ వన్డేకు ముందే తెలుగబ్బాయ్ షాకింగ్ కామెంట్స్

India vs South Africa, 2nd ODI: రాంచీలో జరిగిన మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీతో రికార్డు సృష్టించగా, రోహిత్ శర్మ అర్ధశతకంతో రాణించాడు.

బాబోయ్.. గంభీర్ నాపై ఫుల్ ప్రెజర్ పెట్టేస్తున్నాడు.. 2వ వన్డేకు ముందే తెలుగబ్బాయ్ షాకింగ్ కామెంట్స్
Tilak Varma Goutam Gambhir

Updated on: Dec 03, 2025 | 12:22 PM

India vs South Africa, 2nd ODI: రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌కు ముందు, భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ తన ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర గురించి కీలక విషయాలను పంచుకున్నాడు.

ప్రాక్టీస్‌లో గంభీర్ వ్యూహం గౌతమ్ గంభీర్ తనను ప్రాక్టీస్ సెషన్లలో ఉద్దేశపూర్వకంగా ఒత్తిడికి గురిచేస్తారని తిలక్ వర్మ తెలిపాడు. “గౌతమ్ సర్ నాకు ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు. నా దగ్గర నైపుణ్యం ఉందని, అన్ని ఫార్మాట్లలో రాణించగలనని చెబుతుంటారు. అయితే, మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకునేందుకు ఆయన ప్రాక్టీస్ సెషన్లలోనే నాపై ఒత్తిడి తెస్తారు. నా సామర్థ్యంపై నమ్మకం ఉండటంతో ఆయన ఎప్పుడూ నాకు సవాళ్లు విసురుతుంటారు. ఆ మద్దతు నాకు చాలా విలువైనది,” అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.

రోహిత్, కోహ్లీలతో డ్రెస్సింగ్ రూమ్ అనుభవం..

సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో కలిసి ఆడటం తన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందని తిలక్ వర్మ చెప్పాడు. “రోహిత్ భాయ్, విరాట్ భాయ్ జట్టులో ఉంటే కాన్ఫిడెన్స్ లెవల్స్ పూర్తిగా వేరుగా ఉంటాయి. వారి వద్ద అపారమైన అనుభవం, జ్ఞానం ఉన్నాయి. వారి నుంచి సాధ్యమైనంత ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను,” అని ఆయన అన్నాడు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరుగెత్తే తీరు గురించి ఆయనతో ఎక్కువగా చర్చిస్తానని తిలక్ తెలిపాడు. విరాట్ కోహ్లీలోని తీవ్రత అద్భుతమని, ఆయనతో కలిసి బ్యాటింగ్ చేయడం, వికెట్ల మధ్య పరుగెత్తడం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు.

వన్డే సిరీస్‌లో భారత్ ముందంజ..

రాంచీలో జరిగిన మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తన 52వ వన్డే సెంచరీతో రికార్డు సృష్టించగా, రోహిత్ శర్మ అర్ధశతకంతో రాణించాడు. బుధవారం రాయ్‌పూర్‌లో జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. అంతకుముందు జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2తో వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..