
భారత క్రికెట్ జట్టులో ‘KKR కోటా’ అంటూ విమర్శలు ఎదుర్కొన్న ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలిస్తూ కనిపిస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కి చెందిన వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నందుకు గంభీర్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో వీరు అద్భుత ప్రదర్శన చేయడంతో అభిమానుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి.
ఒక దశలో ‘వరుణ్ వన్డే క్రికెట్‌కు సరిపోడు’ అని అనుకున్నవారే ఇప్పుడు అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో వరుణ్ 5 వికెట్లు తీసి సంచలన విజయం సాధించాడు. అతని స్పిన్ మాయాజాలంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.
గంభీర్ నిర్ణయాన్ని తప్పుబట్టినవారే ఇప్పుడు అతని వ్యూహాలకు హ్యాట్సాఫ్ అంటున్నారు. “గంభీర్ లేకపోతే వరుణ్ భారత జట్టులోకి వచ్చేవాడు కాదు” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఒప్పుకుంటున్నారు.
భారత బ్యాటింగ్ లైనప్ తొలుత కష్టాల్లో పడినప్పుడు, మాజీ KKR ఆటగాడైన శ్రేయాస్ అయ్యర్ 98 బంతుల్లో 79 పరుగులు చేయడంతో జట్టును గట్టెక్కించాడు. తాను అందుకున్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని, కోచ్ గంభీర్ తన ఎంపికపై తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువు చేసుకున్నాడు.
ఒకవేళ ఈ ముగ్గురు ఆటగాళ్లు విఫలమైతే, గంభీర్ మీద మరిన్ని విమర్శలు వచ్చేవి. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! మొదట ‘KKR కోటా’ అని గంభీర్‌ను ట్రోల్ చేసిన అభిమానులే ఆయన నిర్ణయాలను మెచ్చుకోవడం మొదలుపెట్టారు.
ఐపీఎల్‌లో ప్రతిభ చూపిన కేకేఆర్ ఆటగాళ్లను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చాయి. కానీ, వారంతా న్యూజిలాండ్ మ్యాచ్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించడంతో ‘KKR కోటా’ అని ఎగతాళి చేసినవారు కూడా ఇప్పుడు గంభీర్ నిర్ణయాన్ని అంగీకరించాల్సి వచ్చింది.
భారత జట్టులో స్పిన్నర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం వంటి గంభీర్ వ్యూహాలు ఇప్పుడు ఫలితమిస్తున్నాయి. ఈ విజయంతో, భారత్ గ్రూప్ దశను నెంబర్ 1 జట్టుగా ముగించింది.
ఇప్పుడు అందరి దృష్టి గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాలు తదుపరి మ్యాచ్‌లలోనూ ప్రభావం చూపుతాయా లేదా అన్నదానిపై ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్, ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లలో భారత జట్టు ఇదే జోరు కొనసాగిస్తుందా? గంభీర్ వ్యూహం భారత్‌కు టైటిల్ అందిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
If Varun Chakravarthy is KKR Quota then we need more KKR Quota players in Indian Team 🇮🇳🔥 pic.twitter.com/hthVJ6iRCx
— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) March 2, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.