టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా.. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లు ఇవే.. లిస్టులో ఏమున్నాయంటే?

ICC ODI World Cup 2023: 1975లో మొదటి ఎడిషన్‌తో ప్రారంభమైన వన్డే ప్రపంచకప్, గత 48 ఏళ్లలో కేవలం ఐదు జట్లు మాత్రమే ప్రపంచకప్‌ ట్రోఫీని గెలుచుకోగలిగాయి. అయితే, ఈ 5 టీంలలో కేవలం రెండు జట్టు మాత్రమే వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ట్రోఫీని ముద్దాడాయి. ఈ లిస్టులో ఏయే జట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా.. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లు ఇవే.. లిస్టులో ఏమున్నాయంటే?
World Cup 2023 Trophy

Updated on: Oct 23, 2023 | 8:53 PM

ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవడం కోసం అన్ని జట్లు తమ శాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతోన్న 2023 ప్రపంచకప్ లోనూ అన్ని జట్లు తమ బలాలను వినియోగించుకుంటూ టోర్నీలో ముందుకు దూసుకెళ్తున్నాయి. అయితే, అన్ని జట్ల కంటే రోహిత్ సేన ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయంతో ముందుకు వెళ్తోంది. టోర్నీలో టీమిండియా ఇప్పటి వరకు అజేయంగా నిలిచింది. అయితే, 1975లో మొదటి ఎడిషన్‌ను ప్రారంభించి, గత 48 ఏళ్లలో కేవలం ఐదు జట్లు మాత్రమే ప్రపంచకప్‌ను గెలుచుకోగలిగాయి. ఆ జట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే ప్రపంచకప్‌లో గెలిచిన 5 టీంలలో కేవలం రెండు జట్లు మాత్రమే టోర్నమెంట్‌లో అజేయంగా కొనసాగడం ద్వారా టైటిల్‌ను ఖాయం చేసుకోగలిగాయి. అందులో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లూ రెండుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నాయి.

వెస్టిండీస్ – 1975: వెస్టిండీస్ 1975లో ఇంగ్లండ్‌లో టైటిల్ గెలుచుకోవడంతో తొలిసారి వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించింది. టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ కరీబియన్ జట్టు విజయం సాధించింది. 1975 ప్రపంచకప్‌లో క్లైవ్ లాయిడ్ జట్టు శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా (రెండుసార్లు)లను ఓడించింది.

వెస్టిండీస్ – 1979: 1979లో ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, టైటిల్‌ను కాపాడుకుంంది. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్‌ నుంచి అజేయంగా నిలిచి మరోసారి ట్రోఫీని ముద్దాడింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా బంతి కూడా వేయకుండానే రద్దు చేశారు. తర్వాత వెస్టిండీస్ విజయాల పరంపర ఆగిపోయింది.

ఆస్ట్రేలియా – 2003: 2003 టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను అజేయంగా గెలుచుకున్న రెండో జట్టుగా నిలిచింది. దక్షిణాఫ్రికాలో జరిగిన సుదీర్ఘ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన 11 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

ఆస్ట్రేలియా – 2007: వెస్టిండీస్ మాదిరిగానే, ఆసీస్ కూడా మరోసారి ఓటమిని చవిచూడకుండా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. కరేబియన్ దీవులలో ఆస్ట్రేలియా ఈ ఘనతను సాధించింది. టోర్నమెంట్‌లోని తన 11 మ్యాచ్‌లలో మరోసారి విజయం సాధించింది.

1999, 2003లో టైటిల్‌ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియాకు ఇది వరుసగా మూడో ప్రపంచ కప్ విజయం.

ప్రస్తుతం 10 టీంలు..

ప్రస్తుత వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, లీగ్ దశలో టాప్ 4 లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ ఫైనల్స్ చేరుకుంటాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టిక చూస్తే టీమిండియా అజేయంగా నిలిచి, అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..