IPL 2025: మెగా వేలానికి ముందే భారీ స్కెచ్ వేసిన ప్రీతి జింటా.. అత్యధిక పర్స్‌తో ఎంట్రీ ఇచ్చే 3 జట్లు ఇవే..

|

Nov 02, 2024 | 9:14 AM

IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందే అన్ని జట్లు తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్లను ప్రకటించాయి. ఈ మేరకు కొన్ని జట్లు తక్కువ మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఎక్కువ పర్స్ విలువతో మెగా వేలానికి రానున్నాయి.

IPL 2025: మెగా వేలానికి ముందే భారీ స్కెచ్ వేసిన ప్రీతి జింటా.. అత్యధిక పర్స్‌తో ఎంట్రీ ఇచ్చే 3 జట్లు ఇవే..
Pbks
Follow us on

IPL 2025: మొత్తం 10 ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితా గురువారం (అక్టోబర్ 31) వెల్లడైంది. రాబోయే సీజన్ కోసం మెగా వేలానికి ముందు చాలా ఫ్రాంచైజీలు ఐదుగురు నుంచి ఆరుగురు ఆటగాళ్లను ఉంచుకున్నాయి. అయితే, అదే సంఖ్యలో ఆటగాళ్లను నిలబెట్టుకోవడానికి, ప్రతి ఫ్రాంచైజీ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ నిలుపుదల కోసం రూ.75 కోట్ల వరకు వెచ్చించే అవకాశం ఉంది. అదేవిధంగా, ఈసారి మెగా వేలం కోసం బోర్డు అన్ని ఫ్రాంచైజీల పర్స్ మనీని రూ.120 కోట్లుగా నిర్ణయించింది. ఈసారి అత్యధిక పర్స్ మనీతో మెగా వేలంలోకి ప్రవేశించనున్న మూడు ఫ్రాంచైజీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

3. లక్నో సూపర్ జెయింట్స్ (రూ. 69 కోట్లు)..

IPL 2022లో రెండు జట్లు భాగమయ్యాయి. అందులో లక్నో సూపర్ జెయింట్స్ పేరు కూడా చేరింది. ఐపీఎల్ 18వ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వీటిలో నికోలస్ పురాన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోని పేర్లు ఉన్నాయి. వీరిని నిలుపుకోవడానికి ఫ్రాంచైజీ అత్యధిక డబ్బును పూరన్‌పై ఖర్చు చేసింది. రూ. 21 కోట్లకు అతడ్ని అట్టిపెట్టుకున్నారు. అయితే, ఫ్రాంచైజీకి ఇప్పటికీ మంచి పర్స్ విలువ మిగిలి ఉంది. 69 కోట్ల రూపాయల పర్స్ విలువతో LSG మెగా వేలంలోకి ప్రవేశించనుంది.

2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ. 83 కోట్లు)..

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవలేదు. ఐపీఎల్ రాబోయే సీజన్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీ విశ్వాసం వ్యక్తం చేసింది. విరాట్‌ కోహ్లితో పాటు రజత్‌ పటీదార్‌, యశ్‌ దయాల్‌లను ఆర్‌సీబీ తన వద్దే ఉంచుకుంది. ఇప్పుడు RCB పర్స్‌లో రూ. 83 కోట్లు మిగిలాయి.

1. పంజాబ్ కింగ్స్ (రూ. 110.5 కోట్లు)..

IPL 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్ ఫ్రాంచైజీలో ఉన్నారు. పంజాబ్ అత్యధిక పర్స్ విలువతో మెగా వేలంలోకి ప్రవేశించనుంది. ఫ్రాంచైజీ పర్స్‌లో ఇంకా రూ.110.5 కోట్లు మిగిలి ఉన్నాయి. వేలంలో డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు పంజాబ్‌ బిగ్ ప్లాన్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..