T20 World Cup: ఆసక్తికరంగా సూపర్ 8 పోరు.. తొలి రౌండ్ నుంచే బ్యాగులు సర్దేసిన తోపు జట్లు..
T20 World Cup 2024 Super-8 Scenario: టీ20 ప్రపంచ కప్ 2024లో ప్రస్తుతం ప్రతి మ్యాచ్ జట్లకు చాలా విలువైనదిగా మారింది. అలాగే, కొన్ని జట్లకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అయిపోయింది. కొన్ని జట్లు సులువుగా తదుపరి రౌండ్‌కు వెళుతున్నట్లు అనిపిస్తుండగా, కొన్ని జట్ల మెడపై కత్తి వేలాడుతున్నాయి. ఏ జట్లకు సులభమైన మార్గం ఉంది, ఏ జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అంచున ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2024 Super-8 Scenario: టీ20 ప్రపంచ కప్ 2024లో ప్రస్తుతం ప్రతి మ్యాచ్ జట్లకు చాలా విలువైనదిగా మారింది. అలాగే, కొన్ని జట్లకు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై అయిపోయింది. కొన్ని జట్లు సులువుగా తదుపరి రౌండ్‌కు వెళుతున్నట్లు అనిపిస్తుండగా, కొన్ని జట్ల మెడపై కత్తి వేలాడుతున్నాయి. ఏ జట్లకు సులభమైన మార్గం ఉంది, ఏ జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే అంచున ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్థాన్ మెడపై కత్తి వేలాడుతోంది..
టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ జట్టు ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. సూపర్-8కి వెళ్లాలంటే, పాకిస్థాన్ తన రెండు మ్యాచ్‌లను ఎలాగైనా గెలవాల్సి ఉంది. ఆ తరువాత, USA జట్టు తన తదుపరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలని కూడా కోరుకోవాల్సి ఉంటుంది. USA ఇంకా భారత్, ఐర్లాండ్‌లతో ఆడవలసి ఉంది. వారు ఈ జట్లలో దేనినైనా ఓడిస్తే అప్పుడు ఆ జట్టు 6 పాయింట్లతో సూపర్-8కి చేరుకుంటారు. పాకిస్తాన్ ఔట్ అవుతుంది.
శ్రీలంకపై కూడా బయటపడే ప్రమాదం..
శ్రీలంక ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ ఓడిపోయింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా కేవలం 4 పాయింట్లను మాత్రమే చేరుకోగలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ తమ మిగిలిన మ్యాచ్‌లను ఓడిపోవాలని, అప్పుడే శ్రీలంక మార్గం కొంచెం సులభతరం కావాలని వారు ప్రార్థించవలసి ఉంటుంది.
విషమంగా ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ పరిస్థితి..
We look at which teams can still make it through to the second round of the #T20WorldCup and which sides are looking at an early flight out of USA and the West Indies 👀
Details ⬇https://t.co/gwgmVlQ1Hu
— ICC (@ICC) June 10, 2024
గ్రూప్-బిలో ఇంగ్లండ్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 5 పాయింట్లు మాత్రమే ఖాతాలో ఉంటాయి. కాగా స్కాట్లాండ్‌కు ఇప్పటికే 5 పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా రెండు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఈ కారణంగా ఇంగ్లండ్ ప్రయాణం చాలా కష్టంగా మారింది. స్కాట్లాండ్ తమ తదుపరి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోవాలని, ఆస్ట్రేలియా తమ మిగిలిన రెండు మ్యాచ్‌లను కూడా ఓడిపోవాలని ఆ జట్టు ప్రార్థించవలసి ఉంటుంది.
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ అట్టడుగు స్థానంలో..
టీ20 ప్రపంచకప్‌లో కివీ జట్టుకు శుభారంభం బాగోలేదు. తమ తొలి మ్యాచ్‌లోనే ఆఫ్ఘనిస్థాన్‌తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ జట్టు మరో మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..