
ఇండియా, పాక్(IND vs PAK) మ్యాచ్ అంటే రెండు దేశాల్లోని ప్రజలకు చాలా ఉత్సాహం ఉంటుంది. దాయాది దేశాల మధ్య జరిగే పోరును చూసేందుకు అభిమానులు ఎగబడుతుంటారు. అయితే ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు వరల్డ్ కప్, ఆసియా కప్‌లో మాత్రమే జరుగుతున్నాయి. అదీ ఏడాదికో రెండేళ్లకో ఇరు దేశాలు తలపడుతున్నాయి. ఈసారి పాక్‌తో ఇండియా 4 సార్లు తలపడే అవకాశం ఉంది. అదీ నాలుగు నెల్లలోనే. ఈ మ్యాచ్‌లకు శ్రీలంక, ఆస్ట్రేలియా వేదికలు కాబోతున్నాయి. 4 నెలల్లో భారత్-పాకిస్థాన్ 4 సార్లు ఎక్కడు, ఎప్పుడు ఢీకొంటాయో చూద్దాం. త్వరలో శ్రీలంకలో ఆసియా కప్(Asia cup) జరగనుండగా.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్(T20 World cup) జరగబోతుంది.
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో శ్రీలంకలో ఆసియా కప్ జరగనుంది. టోర్నమెంట్ T20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు. ఇందులో భారత్, పాక్ రెండుసార్లు తలపడే అవకాశం ఉంది. టోర్నీ లీగ్ దశలో ఇరు జట్లు ఖచ్చితంగా పోటీపడతారు. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంటే..రెండోసారి కూడా తలపడతాయి. అంటే ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 మధ్య భారత్-పాకిస్థాన్ మధ్య రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ ముగిసిన తర్వాత, T20 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా అతిధ్యం ఇవ్వబోతుంది. అక్టోబర్-నవంబర్‌లో ఈ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఈ ICC పెద్ద ఈవెంట్‌లో భారత్-పాకిస్తాన్ అక్టోబర్ 23న తలపడనున్నాయి. ఆస్ట్రేలియాలోని అతిపెద్ద మైదానమైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ పోరు జరగనుంది. అయితే నవంబర్ 13న కూడా ఇండియా, పాక్ తలపడేలాంటే భారత్, పాకిస్థాన్‌లు రెండూ ఫైనల్‌కు చేరుకోవాలి.
టీ20 క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్‌లు రెండూ బలమైన జట్లే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియాకప్ ఫైనల్ అయినా.. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ అయినా.. ఇరు జట్లు అక్కడికి చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇదే జరిగితే 4 నెలల్లో 4 సార్లు పాక్‌తో భారత్ తలపడనుంది.
Read Also.. IPL 2022: చెన్నైకి టెన్షన్ పెడుతున్న 8 కోట్ల ఆటగాడు.. జట్టులో ఇంకా చేరలేదు..!