IND vs SA : రెండో వన్డేలో పొంచి ఉన్న ముప్పు..మ్యాచ్‌ను ఒక్కరే మలుపు తిప్పగల నలుగురు డేంజరస్ ప్లేయర్స్ వీళ్లే

భారత్, సౌతాప్రికా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో వన్డేను గెలిచి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ కేవలం 11 పరుగులకే కుప్పకూలినా, ఆ జట్టు ఆటగాళ్లు చివరి ఓవర్ వరకు పోరాడారు.

IND vs SA : రెండో వన్డేలో పొంచి ఉన్న ముప్పు..మ్యాచ్‌ను ఒక్కరే మలుపు తిప్పగల నలుగురు డేంజరస్ ప్లేయర్స్ వీళ్లే
Ind Vs Sa

Updated on: Dec 01, 2025 | 7:03 PM

IND vs SA : భారత్, సౌతాప్రికా మధ్య జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో వన్డేను గెలిచి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి వన్డేలో 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా టాప్ ఆర్డర్ కేవలం 11 పరుగులకే కుప్పకూలినా, ఆ జట్టు ఆటగాళ్లు చివరి ఓవర్ వరకు పోరాడారు. ఈ పోరాట పటిమ చూస్తుంటే రెండో వన్డేలో కూడా సౌతాఫ్రికా గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్‌లో టీమిండియాకు ప్రమాదకారిగా మారే నలుగురు కీలకమైన సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎవరో, వారి ప్రస్తుత ఫామ్ ఏంటో తెలుసుకుందాం.

1. మ్యాథ్యూ బ్రీట్జ్కే

తొలి వన్డేలో సౌతాఫ్రికా టాప్-3 బ్యాట్స్‌మెన్ 11 పరుగులకే అవుట్ అయిన తర్వాత, బ్రీట్జ్కే అద్భుతంగా ఆడి జట్టుకు ఆశలు కల్పించాడు. బ్రీట్జ్కే 80 బంతుల్లో 1 సిక్సర్, 8 ఫోర్లతో 72 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఈ 27 ఏళ్ల ఆటగాడు తన 10 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 95.48 స్ట్రైక్ రేట్‌తో 614 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 150 పరుగులు. రాయ్‌పూర్ పిచ్‌పై కూడా వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం ఇతని సొంతం.

2. టోనీ డి జోర్జీ

టోనీ డి జోర్జీ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత బౌలర్లకు పెద్ద సవాలు విసిరే అవకాశం ఉంది. మొదటి వన్డేలో 35 బంతుల్లో 39 పరుగులు చేసిన జోర్జీ, అంతకుముందు పాకిస్తాన్ పర్యటనలో వన్డేలో 76 పరుగులు, టెస్ట్‌లో సెంచరీ కూడా చేశాడు. ఇతను ఆసియా పిచ్‌లపై ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. 28 ఏళ్ల జోర్జీ 21 వన్డే మ్యాచ్‌లలో 97.72 స్ట్రైక్ రేట్‌తో 688 పరుగులు చేశాడు. అతని మెరుగైన ఫీల్డింగ్ కూడా జట్టుకు కీలకం.

3. మార్కో యాన్సెన్

మార్కో యాన్సెన్ గత రెండు మ్యాచ్‌లలో (టెస్ట్, వన్డే) ఒక పక్కా బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్నాడు. భారత్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 93 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు 7 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మొదటి వన్డేలోనూ 179.49 స్ట్రైక్ రేట్‌తో కేవలం 39 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. అతని కారణంగా దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ చాలా బలంగా మారింది. అతని పొడవైన శరీరం బౌలింగ్‌లోనూ భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతుంది.

4. కార్బిన్ బాష్

యాన్సెన్ అవుట్ అయిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్, ఒత్తిడిలో అద్భుతమైన హాఫ్ సెంచరీతో టీమిండియాకు దడ పుట్టించాడు. 6 వికెట్లు పడిన తర్వాత జట్టుకు ఇంకా 123 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి, 51 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. అతని కారణంగానే సౌతాఫ్రికా చివరి ఓవర్ వరకు మ్యాచ్‌లో నిలబడింది. పాకిస్థాన్ పర్యటనలో కూడా ఇతను 41 పరుగుల మంచి ఇన్నింగ్స్‌తో పాటు 3 వన్డేలలో 4 వికెట్లు తీశాడు.

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ కీలకమైన రెండో వన్డే మ్యాచ్ డిసెంబర్ 3, 2025, బుధవారం రోజున జరగనుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. దీనికి అరగంట ముందు, అంటే మధ్యాహ్నం 1:00 గంటలకు టాస్ వేయబడుతుంది. ఈ మ్యాచ్‌ను రాయ్‌పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో నిర్వహిస్తారు. టీవీలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో ఉంటుంది. అలాగే మొబైల్ లేదా కంప్యూటర్‌లో చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్ యాప్ లేదా దాని వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉన్నందున ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..