టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అతనిని థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించారు. 52 ఏళ్ల కాంబ్లీ చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని వైద్యులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల బృందం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేస్తోంది. వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన వారందరూ కాంబ్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా ఇటీవల ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో దివంగత కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అచ్రేకర్ శిష్యులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీల్ చైర్‌లో కూర్చున్న వినోద్ కాంబ్లీ పరిస్థితి చూసి అందరూ షాక్ అయ్యారు. అతను సరిగ్గా లేచి నిలబడలేకపోయాడు. కనీసం మాట్లాడలేకపోయాడు కూడా. కాంబ్లీ దీన పరిస్థితి చూసిన మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతనికి సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. సాయం అందుకునేందుకు కాంబ్లీ సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. రిహాబిలేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు తాను సిద్ధమేనని, అక్కడికి వెళ్లేందుకు తనకెలాంటి భయం లేదన్నాడు. ఇంతలోనే కాంబ్లీ ఆస్పత్రి పాలు కావడం క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది.
వినోద్ కాంబ్లీ 1991లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 1993లో టెస్టు క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. కాంబ్లీ ఆట తీరును చూసి మరో దిగ్గజ క్రికెటర్ అవుతాడనుకున్నారు. కానీ చేజేతులా తన కెరీర్ ను నాశనం చేసుకున్నాడు. 1991-2000 ల మధ్య కాలంలో పరుగుల వర్షం కురిపించిన కాంబ్లీ 2000 సంవత్సరం నుంచి పూర్తిగా డీలా పడిపోయాడు. దీంతో అతనికి టీమ్ ఇండియాలో చోటు దక్కలేదు. వినోద్ కాంబ్లీ చివరిసారిగా 2000లో షార్జాలో ఆడాడు. ఆ తర్వాత జట్టులోకి పునరాగమనం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
Today meet great cricketer vinod kambli sir in AKRUTI hospital pic.twitter.com/3qgF8ze7w2
— Neetesh Tripathi (@NeeteshTri63424) December 23, 2024
అభిమానుల ప్రార్థనలు..
In pictures: Cricketer Vinod Kambli’s condition deteriorated again, leading to his admission at Akriti Hospital in Thane late Saturday night. His condition is now stable but remains critical. pic.twitter.com/7NBektzQ54
— IANS (@ians_india) December 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..