
భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చిన సౌరవ్ గంగూలీ బయోపిక్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఎందరో స్టార్ హీరోలు, డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. అయితే మూవీ మాత్రం పట్టాలెక్కడం లేదు. తాజాగా ఈ బయోపిక్ పై సౌరవ్ గంగూలీనే స్వయంగా స్పందించాడు. గురువారం ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన బుర్ద్వాన్ వెళ్లారు. అక్కడ, తన బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నంతవరకు.. టైటిల్ రోల్లో రాజ్ కుమార్ రావ్ నటించనున్నారు. అయితే డేట్స్ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా విడుదలయ్యేందుకు మరో ఏడాదిపైనే సమయం పట్టొచ్చు’ అని గంగూలీ చెప్పుకొచ్చారు”
ఈ వార్త వెలువడిన వెంటనే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. యాదృచ్ఛికంగా, సౌరవ్ బయోపిక్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సౌరవ్ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఆసక్తి కూడ పెరిగింది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నుంచి రణబీర్ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చివరికి రాజ్ కుమార్ రావు పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కాగా గతేడాది స్త్రీ 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు రాజ్ కుమార్ రావు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అంతకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో రాజ్ కుమార్ రావు అద్భుతంగా నటించాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో దాదాగా పేరొందిన సౌరవ్ గంగూలీ బయోపిక్‌లోనూ రాజ్ కుమార్ రావును ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.
రాజ్‌కుమార్ రావు కంటే ముందు, సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించేందుకు ఇద్దరు బాలీవుడ్ సూపర్ స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్లను దాదా పాత్ర కోసం సంప్రదిచారట. అయితే ఎందుకోగానీ ఇప్పుడు అనూహ్యంగా రాజ్ కుమార్ రావ్ పేరు తెరపైకి వచ్చింది.
త్వరలోనే..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..