టీ20 ప్రపంచ కప్‌ జట్టులో పేరు లేదు.. అయినా కీలక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ పరువు కాపాడిన స్టార్ బ్యాట్స్‌మెన్

|

Sep 11, 2021 | 8:44 AM

బుధవారం బంగ్లాదేశ్‌తో సిరీస్ కోల్పోయిన తర్వాత న్యూజిలాండ్ తమ విశ్వసనీయతను కాపాడుకోవడానికి చివరి టీ 20లో ఓదార్పు విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ 2-3 తేడాతో ఓడిపోయింది.

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో పేరు లేదు.. అయినా కీలక ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ పరువు కాపాడిన స్టార్ బ్యాట్స్‌మెన్
Bangladesh Vs New Zealand
Follow us on

Bangladesh vs New Zealand: బంగ్లాదేశ్‌తో సిరీస్ కోల్పోయిన తర్వాత, న్యూజిలాండ్ ఐదవ, చివరి టీ 20 మ్యాచ్‌లో 27 పరుగుల విజయంతో ఓదార్పు విజయాన్ని నమోదు చేసి, తమ పరువును కాపాడుకుంది. న్యూజిలాండ్ విజయంలో దాని స్టార్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ (41 పరుగులు), టామ్ లాథమ్ కీలక పాత్ర పోషించారు. వారు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో కివీస్ విజయం సాధించింది. ఈ సిరీస్‌ను బంగ్లాదేశ్ 3-2తో గెలుచుకుంది.

ప్రపంచ కప్ జట్టులో తనను ఎంపిక చేయని సెలెక్టర్లకు ఫిన్ అలెన్ తన ఇన్నింగ్స్‌తో గట్టిగా సమాధానమిచ్చాడు. గురువారం, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు యూఏఈలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించింది. ఇందులో ఫిలిప్ పేరు చేర్చబడలేదు. టీం సెలక్షన్ జరిగిన ‎ఒకరోజు తరువాత ఫిలిప్ తన ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు తగిన సమాధానం చెప్పాడు. న్యూజిలాండ్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆడమ్ మిల్నేను 16 వ ఆటగాడిగా రిజర్వ్ ప్లేయర్‌గా జట్టులో చేర్చారు. టెస్ట్ అరంగేట్రంలో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన డెవాన్ కాన్వే కూడా జట్టులో చోటు సంపాధించాడు. కైల్ జమీసన్ కూడా జట్టులో చేరాడు. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్‌ని కూడా పొట్టి ప్రపంచ కప్‌ జట్టులో ఉంచారు.

ఘనమైన ఆరంభాన్ని అందించిన అలెన్
మ్యాచ్ విషయానికి వస్తే.. రచిన్ రవీంద్రతో అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో కివీస్ జట్టు విజయానికి అలెన్ పునాది వేశాడు. అలెన్ 24 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ జోడీ తర్వాత, లాథమ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. హెన్రీ నికోలస్ అతనికి మద్దతు అందించాడు. ఈ కారణంగా, న్యూజిలాండ్ 20 ఓవర్ల తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరఫున షోరిఫుల్ రెండు వికెట్లు తీశాడు.

ఈ సిరీస్‌లో కివీ జట్టులో అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అఎజాజ్ పటేల్ మరోసారి తన సత్తా చాటాడు. అతను లిట్టన్ దాస్, నూరుల్ హసన్ వంటి కీలక వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున అఫిఫ్ హుస్సేన్ 49 పరుగులు చేశాడు. అయితే జట్టు విజయం కోసం ఈ ఇన్నింగ్స్ సరిపోలేదు. మహ్మద్ నయీమ్ (23), మహ్మదుల్లా మాత్రమే 20 కి పైగా పరుగులు సాధించారు. బంగ్లాదేశ్ జట్టు మొత్తం 134 పరుగులకు ఆలౌట్ అయింది.

సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్..
అంతకుముందు, బంగ్లాదేశ్ నాలుగో టీ 20 లో న్యూజిలాండ్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది. బంగ్లాదేశ్ టీం న్యూజిలాండ్‌తో తొలిసారిగా టీ 20 సిరీస్‌ను గెలుచుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో 3-1 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 93 పరుగులకు కుదించారు. బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్ అజేయంగా 43 పరుగులు చేసి నాలుగో టీ 20 మ్యాచ్‌లో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాడు.

Also Read:

India Vs England: ”ట్రోఫీ తెస్తారనుకుంటే.. ఇదేంటి మాస్టారూ” టీమిండియాను ఏకిపారేస్తున్న నెటిజన్లు.!

అమెరికాలో క్రికెట్ సందడి.. 7 టీమ్స్.. 10 రోజులు.. ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్.. ఎప్పటినుంచంటే.!