ఇంగ్లాండ్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లకు మద్యం సేవిస్తూ.. ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు ఉంది. ఇక ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా ఉండటంతో క్రికెట్ అభిమానులు మందు తాగుతూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. కాగా శుక్రవారం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు స్టేడియంలో ఉన్న చాలా గ్యాలరీలు ఖాళీగా ఉండడం చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారట. స్టేడియం బయటకు వెళ్లి చూడగా.. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బార్ ముందు ఫ్యాన్స్ క్యూ కట్టడం చూసి వారు అవాక్కయ్యారు. మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన వందలాది మంది మద్యం కోసం అక్కడ వరుసలో నిలబడి ఉండటం విశేషం.
ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్‌లో విండీస్ పేలవమైన ఆట తీరును ప్రదర్శించింది. ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుండటం వల్ల మందుబాబులందరూ ఒక్క చుక్క వేసొద్దాం అనుకున్నట్లు ఉన్నారు.